తెలంగాణ కు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు.
టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్.
చెన్నై డి లిమిటేషన్ జేఏసీ సమావేశలో పాల్గొని ప్రసంగించిన టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్.. అనంతరం చెన్నై లో ప్రెస్ మీట్ లో మాట్లాడిన మహేష్ కుమార్ గౌడ్.
జనాభా లెక్కల పార్లమెంట్ డి లిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుంది.
డి లిమిటేషన్ చేయాలంటే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా ఒక సమగ్రమైన ఒక శాస్త్రీయ కమిటీ వేసి అధ్యయనం చేశాక మొదలు పెట్టాలి.
1976 లో కుటుంబ నియంత్రణ చట్టాన్ని దక్షిణాది రాష్ట్రాలు పకడ్బందీగా అమలు చేసాయి. దాంతో ఇక్కడ జనాభా తగ్గింది. అందుకు మేము నష్టపోవలా..
బీజేపీ ఒక రాజ్యాంగేతర శక్తిగా తయారైంది. రాజ్యాంగ సంస్థలను విద్వంసం చేస్తూ తన స్వంత ఎజెండా ను ప్రజలపై రుద్దుతుంది.
తెలంగాణ దేశంలోనే కొత్త రాష్ట్రం.. సోనియాగాంధీ దయ తో 60 ఏళ్ల తెలంగాణ కల సాకారం అయింది.
దేశానికి ఎక్కువ శాతం పన్నులు చెల్లిస్తూ కేంద్రం నుంచి తక్కువ మొత్తంలో లబ్ది పొందుతున్న రాష్ట్రాలు కూడా దక్షిణాది రాష్ట్రాలే.
ఈ విదంగా జనాభా లెక్కలతో డి లిమిటేషన్ జరిపితే మరింత నష్టపోతాము..
ఏప్రిల్ లో హైదరాబాద్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశంలో ప్రకటించారని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు..