క్రెసెంట్ కేఫ్ & బేకర్స్ వద్ద గ్యాస్ సిలిండర్ పేలుడు
ఐదుగురు గాయాలు, ఒకరి పరిస్థితి విషమం
హైదరాబాద్, మార్చి 23:
హైదరాబాద్ నగరంలోని క్రెసెంట్ కేఫ్ & బేకర్స్ వద్ద ఈ రోజు ఉదయం 5 గంటల ప్రాంతంలో గ్యాస్ సిలిండర్ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు గాయపడగా, ఒకరి పరిస్థితి తీవ్రంగా ఉంది.
పేలుడు తీవ్రతతో సమీపంలోని హోటల్ హరి దోస భవనం గోడకు బీటలు వారాయి. ఘటన జరిగిన వెంటనే స్థానికులు, అధికారులు కలిసి గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు.
స్థానికుల ఆందోళన – చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా, హోటళ్లు, టీల్లు, ఇడ్లీ, దోశ బండ్లలో గ్యాస్ సిలిండర్ల వినియోగంపై కఠిన నియంత్రణలు విధించాలని స్థానికులు అధికారులను కోరారు. సరైన భద్రతా చర్యలు పాటించకపోతే, మరింత ప్రాణనష్టం జరగవచ్చు అని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
అధికారుల స్పందన
ప్రమాదంపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. నిర్లక్ష్యంగా వాడుతున్న గ్యాస్ సిలిండర్లపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని వారు తెలిపారు.