"రామచంద్రపురం మండలంలో వెల్ల, ద్రాక్షారామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశాలు"

By Ravi
On

రామచంద్రపురం మండలంలో గల వెల్ల, ద్రాక్షారామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం జరిగినది. 
వెల్ల, ద్రాక్షారామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ శ్రీమతి అంబటి భవాని ఎంపీపీ గారి అధ్యక్షతన సమావేశం జరిగినది.

శ్రీమతి అంబటి భవాని మాట్లాడుతూ.. జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను గ్రామస్థాయిలో సక్రమంగా అమలు చేయాలని హాస్పటల్లో నార్మల్ డెలివరీలు జరిగేటట్లు ప్రోత్సహించాలని తెలిపారు.
 పగలు ఉష్ణోగ్రతలు పెరుగుట వలన  ఓ ఆర్ ఎస్ పాకెట్స్, మంచినీరు అన్ని విలేజ్ హెల్త్ క్లినిక్ లలో  అందుబాటు లో ఉంచాలని తెలిపారు
.వెల్ల ప్రాథమిక ఆరోగ్య  కేంద్రం సమావేశంలో వీరబోయిన సూరిబాబు , గ్రామ సర్పంచి వెల్ల, పిల్లి అచల రాజేశ్వరిబాలసుబ్రమణ్యం, గ్రామ సర్పంచ్ తాడిపల్లి,   డాక్టర్  వి వి లక్ష్మీప్రసన్న ,డాక్టర్ అలేఖ్య గారు, ఎంపీడీవో  ఆఫీస్ ఏ ఓ సుబ్రమణ్యం , సూపర్వైజర్లు కె . శ్రీనివాస్,జి కమల్ శేషు, డి రాజేశ్వరి లు పాల్గొన్నారు.  ద్రాక్షారామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమావేశంలో కొత్తపల్లి అరుణ   గ్రామ సర్పంచ్ ద్రాక్షారామ, మెండు  చారిటబుల్  ఫౌండేషన్ వారి ద్వారా 14లక్షల వ్యయంతో ప్రత్యేక గదులు నిర్మాణం చేస్తున్నందుకు  కృతజ్ఞతలు తెలియజేశారు. టేకుమూడి సుజాత సర్పంచ్, డాక్టర్ ఎన్ ప్రశాంతి  డాక్టర్ టి సందీప్ నాయుడు  ఎంపీడీవో ఆఫీస్ ఏ ఓ సుబ్రమణ్యం , యు. వీరవేణి  సి హెచ్. ఓ. సూపర్వైజర్ లు ఎన్.గంగాధరరావు, జి  వరలక్ష్మి పాల్గొన్నారు.

Tags:

Advertisement

Latest News