కొల్లేరు చిక్కుముడి పరిష్కరిస్తాం

--   ఏలూరు ఎంపి మహేష్‌ వెల్లడి

By Ravi
On
కొల్లేరు చిక్కుముడి పరిష్కరిస్తాం

ఏలూరు :  కొల్లేరు చిక్కుముడిని పరిష్కరించేందుకు కృషిచేస్తానని ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ అన్నారు. స్ధానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో శనివారం జరిగిన దిశ సమావేశం అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు.  కొల్లేరుకు సంబంధించి అంశం సుప్రీం కోర్టులో నడుస్తున్నదన్నారు.   ఈ సున్నితమైన సమస్య పరిష్కరించడానికి చాలా సమయం పట్టేటట్లు కనబడుతున్నప్పటికీ నూరుశాతం పరిష్కరించేందుకు కృషిచేస్తానన్నారు.   ఏప్రిల్ 10వ తేదీన కనీసం వెయ్యిమందికి ఉపాధికల్పించేలా మెగా జాబ్ మేళా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు.  జిల్లాలో ఇప్పటికే పలురహదారులు అభివృద్ధి పనులు చేయడం జరిగిందని, పూర్తిగా దెబ్బతిన్న రహదారుల అభివృద్ధి చేసే పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.  సమావేశంలో జెడ్పి చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ, చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్, జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి పాల్గొన్నారు.

Tags:

Advertisement

Latest News

పాత రిజిస్ట్రేషన్ పద్ధతిని కొనసాగించండి – డాక్యుమెంట్ రైటర్స్ డిమాండ్ పాత రిజిస్ట్రేషన్ పద్ధతిని కొనసాగించండి – డాక్యుమెంట్ రైటర్స్ డిమాండ్
రిజిస్ట్రేషన్లకు సంబంధించి పాత పద్ధతినే కొనసాగించాలని ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన స్లాట్ బుకింగ్ వ్యవస్థను తీసివేయాలని డిమాండ్ చేస్తూ చంపాపేట్ డాక్యుమెంట్ రైటర్స్ సభ్యులు షాపులు బంద్...
27 కిలో మీటర్లు లక్షలాది జనం-కని విని ఎరుగని రీతిలో వీర హనుమాన్ శోభాయాత్ర
24 న భవన నిర్మాణ కార్మికుల ధర్నా
శ్రీకాళహస్తి రాజీవ్ నగర్ ఎస్టి కాలనీకి వాటర్ పైప్ లైన్ ఏర్పాటు – శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు చర్యలు
అక్షర చిట్ ఫండ్ మోసాలు: ధర్నా చౌక్‌లో బాధితుల ఆందోళన
అర్జీల పరిష్కార మార్గం నిజ నిర్థారణ చేసుకోవాలి.
తెలంగాణ అమరనాథ్‌ - సలేశ్వరం యాత్ర..