గాజాపై మరోసారి ఇజ్రాయెల్ దాడి..
గాజాపై మరోసారి ఇజ్రాయెల్ విజృంభించింది. తాజాగా నిన్న షెజైయాలో జరిపిన దాడి ఘటనలో 38 మంది చనిపోయినట్లు పాలస్తీనా ఆరోగ్య అధికారులు అధికారికంగా ప్రకటించారు. షెజైయాలోని ఒక భవనంపై ఇజ్రాయెల్ వైమానిక దాడిలో పిల్లలు సహా కనీసం 29 మంది పాలస్తీనీయన్లు మరణించారని అధికారులు తెలిపారు. చాలామంది గాయపడ్డారని.. చాలా మంది శిథిలాల్లో చిక్కుకున్నారని వైద్యులు తెలిపారు. ఇజ్రాయెల్ సైన్యం ఒక సీనియర్ హమాస్ ఉగ్రవాదిని లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడింది. పౌరులకు హానీ తలపెట్టకుండా ప్రయత్నాలు చేశారు కానీ.. అయినా పౌరులకు నష్టం జరిగిందని అన్నారు.
మొత్తానికి బుధవారం నాడు మృతుల సంఖ్య 38కి చేరుకున్నట్లు స్పష్టం చేసింది. కాగా ఈ క్రమంలో సీనియర్ ఉగ్రవాదిని హతమార్చినట్లు ఇజ్రాయెల్ సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. కానీ అతని పేరు బయటకు రానివ్వలేదు. పౌరులకు హాని కలగకుండా.. ముందుగా అనేక చర్యలు తీసుకున్నట్లు ఐడీఎఫ్ వెల్లడించింది. ఎన్‌క్లేవ్‌లోని ఇతర ప్రాంతాల్లో ఇజ్రాయెల్ సైనిక దాడుల్లో మరో తొమ్మిది మంది పాలస్తీనియన్లు మరణించారని స్థానిక ఆరోగ్య అధికారులు కూడా నిర్ధారించారు. ఈ క్రమంలో మరణాల సంఖ్య 38కి పెరిగినట్లు పేర్కొంది.