పాత రిజిస్ట్రేషన్ పద్ధతిని కొనసాగించండి – డాక్యుమెంట్ రైటర్స్ డిమాండ్
రిజిస్ట్రేషన్లకు సంబంధించి పాత పద్ధతినే కొనసాగించాలని ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన స్లాట్ బుకింగ్ వ్యవస్థను తీసివేయాలని డిమాండ్ చేస్తూ చంపాపేట్ డాక్యుమెంట్ రైటర్స్ సభ్యులు షాపులు బంద్ చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు.అనాలోచిత నిర్ణయం తో ప్రభుత్వం ముందుకు వెళుతుందని మండిపడ్డారు. ప్రజలకు,ప్రభుత్వానికి డాక్యుమెంట్ రైటర్స్ వారధిగా నడుస్తున్నారని ఈ విషయం ప్రభుత్వం గమనించాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వ అనాలోచితం నిర్ణయం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా లక్షల కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉందని డాక్యుమెంట్ రైటర్స్ ఆవేదన వ్యక్తం చేశారు.అధికారులు ప్రభుత్వ పాలకులకు తప్పుడు సమాచారాన్ని అంది వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకువచ్చిన నిర్ణయం తో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం కూడా తగ్గిపోతుందని తెలిపారు.నిపుణులైన డాక్యుమెంట్ రైటర్ సహాయం తో అధికారికంగా లావాదేవులు జరగడానికి వెసులుబాటు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సేల్ మాత్రమే కాకుండా గిఫ్ట్, పార్టిషన్,సెటిల్మెంట్, కన్వెన్షన్ డీడ్ లాంటి ఇతర దస్తావేజును కూడా ఎల్ఆర్ఎస్ అనుబంధ రిజిస్ట్రేషన్ లో అనుమతించాలని ప్రభుత్వాన్ని కోరారు.ప్రజలకు అనుగుణంగా సులభతరమైన రీతిలో ఉండే మార్పులు మాత్రమే కోరుకుంటున్నామని డాక్యుమెంట్ రైటర్స్ ప్రభుత్వానికి సూచించారు.