అర్జీల పరిష్కార మార్గం నిజ నిర్థారణ చేసుకోవాలి.

By Ravi
On
అర్జీల పరిష్కార మార్గం నిజ నిర్థారణ చేసుకోవాలి.

  • పరిష్కార దిశలో మధ్యవర్తుల ప్రమేయాన్ని నివారించాలి.
  • అర్జిల పరిష్కార విషయంలో ఖచ్చితత్వం, జవాబుదారీతనం  కలిగి ఉండాలి - జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి 

TPN, Sri Ch 
Rajamahendravaram, April 10

ఏదైనా ఒక సమస్య వొస్తే దాని స్థాయినీ కూడా అంచనా వేసి ఆ స్థాయిలో ప్రతిస్పందన ఉంటే తప్పకుండా పరిష్కారం అవుతుందని, హేతుబద్ధత కలిగిన పరిష్కారం చేసినప్పుడే భూ సమస్యలకి, ఇతర సమస్యలకు పరిష్కారం సాధ్యం అవుతుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. స్థానిన కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అధ్యక్షతన రెవెన్యూ అధికారులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రెవెన్యూ అంశాల పరిష్కార మార్గాలు పై వర్క్ షాప్ (కార్యశాల) జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు, డి ఆర్వో టి సీతారామ మూర్తి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ,  రెవెన్యూ అధికారులు కార్యశాల  నిత్యకృత్యమైన సమావేశాలలా కాకుండ ఫలవంతం అయ్యే విధంగా ఒక నిర్ణాయక పాత్ర పోషించాలనీ ఆదేశించారు. సమస్య పరిష్కారం కోసం ఎస్ వో పి (ప్రామాణిక ఆపరేటింగ్ విధానం) మార్గదర్శకాలు జారీ చేయడం జరుగుతుందని, అయితే వాటిపైనే ఆధారపడకుండా  క్షేత్ర స్థాయిలో రెవిన్యూ అధికారులు సముచిత నిర్ణయం తీసుకోవడం ద్వారా తదుపరి చర్యలు తీసుకోవాలని  పేర్కొన్నారు.  వాటి ఆచరణాత్మక విషయాలను పరిగణన లోనికి తీసుకోవడం జరుగుతుందని వెల్లడించారు. భూముల విషయంలో సర్వే నంబర్, ఎల్ పి ఎం నెంబర్ ప్రకారం సబ్ డివిజన్ చెయ్యాల్సి ఉందన్నారు. పిజి ఆర్ఎస్ ఫిర్యాదుల పరిష్కారం దిశగా నాణ్యత  మెరుగుపరచడానికి సరైన వ్యూహం రూపొందించడం జరగాలన్నారు. ఇప్పటి వరకు గత ఎనిమిది నెలలుగా పరిపాలనా విధానంలో వివిధ స్థాయిల్లో పరిష్కారం చూపించినా, ఇంకా సంతృప్తి స్థాయి వ్యక్తం చేయడంలో సమస్యలు చూస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ప్రభుత్వ, ప్రవేటు భూముల పరాయీకరణ (ఎలినేషన్) కోసం అర్జీలు స్వీకరించడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. తాళ్లపూడి మండలం లో వైట్ ఫీల్డ్ స్థలాలు ఇతరులకి కేటాయింపు చెయ్యాలని  , అనపర్తి నియోజక వర్గంలో వ్యర్థాల నుంచి సంపద సృష్టి కోసం కేటాయించిన భూములు కేటాయింపు చెయ్యవద్దు  అని పిజిఆర్ఎస్ లో విభిన్న అర్జీలు ఇవ్వడం జరిగిందన్నారు. ఏదైనా ఒక ప్రత్యేక కార్యక్రమం కోసం కేటాయించిన భూములు వినియోగం చెయ్యని సందర్భంలో పరాయీకరణ కోసం అర్జీలు, దరఖాస్తులు రావడం జరుగుతోందని తెలిపారు. రెవిన్యూ పరంగా పారదర్శకంగా పిటిషనర్ యొక్క ఫిర్యాదుల పరిష్కారానికి కార్యాచరణ ప్రణాళిక ఖచ్చితంగా పాటించాలని కలక్టర్ స్పష్టం చేశారు. కార్యాశాల సందర్భంగా ప్రైవేట్ భూములను 22(ఎ) జాబితాలో ఉంచడం , 22A ఫిర్యాదును పరిష్కరించే వ్యూహం (కేటగిరీ వారీగా) ,  అసైన్‌మెంట్, ఫ్రీహోల్డ్ భూములతో సహా అన్ని అసైన్‌మెంట్ సమస్యలు, భూమి పరాయీకరణ , భూమి క్రమబద్ధీకరణ ,, ఆర్ వో ఆర్ ఇనామ్స్ మరియు ఎస్టేట్ రద్దు-వెబ్‌ల్యాండ్ సమస్యలు -  పరిష్కార సూచిక , రీ సర్వే అంశాలపై చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు తహశీల్దార్లు చేసిన సూచనలు సలహాలు వివరాలతో కూడిన సమగ్ర ఎస్ వో పి సిద్ధం చేసుకుని సమర్థవంతం పిజి ఆర్ఎస్ ఫిర్యాదుల పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు.జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు మాట్లాడుతూ, రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న అర్జీలను సత్వర పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం, సీసీఎల్ఏ కమిషనర్ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. సమస్య పరిష్కారం దిశలో అధికారుల స్థాయిలో కాకుండా క్షేత్ర స్థాయి నుంచి సమగ్ర సమాచారం తెలుసుకుని పరిష్కారం చూపాలని సూచించారు. ముఖ్యంగా రైతుల నుంచి తమ భూములను 22 ఏ, అనుబంధ జాబితా నుంచి తొలగించాలని అర్జీలు వొస్తున్నట్లు పేర్కొన్నారు. అభ్యంతరం లేని ప్రభుత్వ స్థలాల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నా వారికి జీవో 35 ప్రకారం క్రమబద్ధీకరణ కోసం మార్గదర్శకాలు విడుదల చెయ్యడం జరిగిందన్నారు. ఈ కార్యసాలలో జిల్లా రెవిన్యూ అధికారి టి సీతారామ మూర్తి, కె ఆర్ ఆర్ సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎస్ భాస్కర్ రెడ్డి, ఆర్డీవోలు కృష్ణ నాయక్,   రాణి సుస్మిత, జిల్లా ల్యాండ్ అండ్ సర్వే అధికారి బి. లక్ష్మీనారాయణ , 19 మండలాల తహసిల్దార్, మండల సర్వే అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Tags: