మహేశ్వరం మండలాన్ని ఫ్యూచర్ సిటీలో కలపాలని జేఏసీ నేతృత్వంలో ప్రత్యేక సమావేశం

By Ravi
On
మహేశ్వరం మండలాన్ని ఫ్యూచర్ సిటీలో కలపాలని జేఏసీ నేతృత్వంలో ప్రత్యేక సమావేశం


మహేశ్వరం మండలాన్ని ఫ్యూచర్ సిటీలో కలపాలని కోరుతూ జేఏసీ ఆధ్వర్యంలో అఖిలపక్ష నేతలు మహేశ్వరం నియోజకవర్గంలోని అమీర్పేట్ పద్మావతి ఫంక్షన్ హాల్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జేఏసీ చైర్మన్ రఘుపతి నేతృత్వం వహించారు.

ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ, మహేశ్వరం మండలాన్ని ఫ్యూచర్ సిటీలో విలీనం చేయడం అనివార్యమని పేర్కొన్నారు. "మా పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇందుకోసం అవసరమైన అన్ని చర్యలు, త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం" అని జేఏసీ సభ్యులు పేర్కొన్నారు.

సమావేశంలో రేపు ప్రముఖ రాజకీయ నేతలతో చర్చలు జరిపి మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన రంగారెడ్డి ఇంచార్జ్ మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి మెమోరాండం ఇవ్వనున్నట్లు తెలిపారు. నాయకుల స్పందన ఆధారంగా భవిష్యత్ కార్యచరణ నిర్ణయిస్తామన్నారు.

ఈ కార్యక్రమానికి వివిధ పార్టీల నేతలు, మహేశ్వరం మండల ప్రజలు, సామాజిక సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు.

Tags:

Advertisement

Latest News