శ్రీకాకుళం నియోజకవర్గంలో 30 వేల ఎకరాల ఆయకట్టు భూములు ఉన్నాయి - ఎమెల్యే గొండు శంకర్.

By Ravi
On
శ్రీకాకుళం నియోజకవర్గంలో 30 వేల ఎకరాల ఆయకట్టు భూములు ఉన్నాయి -  ఎమెల్యే  గొండు శంకర్.

TPN RAJASEKHAR SRIKAKULAM 
Date 20/03/2025

శ్రీకాకుళం నియోజకవర్గంలో 30 వేల ఎకరాల ఆయకట్టు భూములు ఉన్నాయని భూములన్ని టైయ్యండ్ భూములని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ తెలిపారు. రాష్ట్ర శాసనసభలో గురువారం మాట్లాడుతూ 37 టి పనులు జరగడంలేదని వాటిని క్లోజ్ చేసి తిరిగి పనులు చేసేందుకు రీటెంటరింగ్ ఎస్టిమేషన్ వేయడం జరిగిందని.  ఆర్ఎంసి పనులు నత్త నడకన ఉన్నాయని వెంటనే పనులు వేగవంతం చేయాలని కోరారు. వత్స వలస ఇరిగేషన్ లిస్ట్ పనులు కోసం ప్రపోజల్ చేయడం జరిగిందని , కళింగపట్నం ఎత్తిపోతల పథకం పనులు 90 శాతం పూర్తయ్యాయని వాటి పూర్తి చేయాలని కోరారు. 175 కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్ పనులు మంజూరైన గత ప్రభుత్వం ఐదు శాతం పనులు కూడా చేయలేదని ఈ పనులు కూడా పూర్తి చేసే విధంగా సంబంధిత శాఖ మంత్రి చర్యలు తీసుకోవాలని కోరారు. నేరడి సెకండ్ ఫేస్ పనులు పూర్తిచేస్తే జిల్లా జీవనాడైనా వ్యవసాయ పంట కు పూర్తిస్థాయి సాగునీరు అందుతుందని ఈ దశగా చర్యలు చేపట్టాలని తెలిపారు. ఒరిస్సాతో రిజర్వాయర్ సమస్య ట్రిబ్యూ నల్స్  క్లియరెన్స్ ఇచ్చినప్పటికీ ఒరిస్సా ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లడం జరిగిందని ,   కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం తో ఈ సమస్య పరిష్కారం అయ్యే విధంగా ప్రయత్నాలు చేయాలని కుడి ఎడమ కాలువల ద్వారా సాగునీరు జిల్లాలో పూర్తిస్థాయిలో అందుతుందని దీనిపై ప్రత్యేక దృష్టి సారించి జిల్లా వాసుల రైతులకు దీర్ఘకాలిక సమస్య పరిష్కారం దిశగా ప్రభుత్వ ముందుకు వెళ్లాలని కోరారు.

Tags:

Advertisement

Latest News