హోలీ శుభాకాంక్షలు- జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి.
ఆనందంతో హద్దులు మీరి ప్రవర్తించకండి ఆనందంగా ఐక్యతతో మతసామరస్యానికి ప్రతీకగా హోలీ పండుగ జరుపుకుందాం. పండుకు పేరుతో ఇతరులకు ఇబ్బంది కలిగించి, మీరు ఇబ్బందులకు గురికావద్దు.. జిల్లా ఎస్పీ
పార్వతీపురం మన్యం జిల్లా
మార్చి 14వ తేది హోళీ పండుగ సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి ముందుగా జిల్లా ప్రజలకు మీడియా మిత్రులకు పోలీస్ అధికారులకు, సిబ్బందికి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేసారు.. కులాలు, మతాలు, ప్రాంతాలు అనే తేడా లేకుండా నిర్వహించుకునే పండగల్లో హోలీ పండుగ ఒకటి అన్నారు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఒకటే అనే భావనతో, అందరూ రంగులు అద్దుకొని ఆనందంగా ప్రశాంత వాతావరణంలో హోలీ పండుగ జరుపుకోవాలని జిల్లా ఎస్పీ సూచించారు, ఎవరైనా రోడ్లమీద వెళ్లే వారిపై, ఇతరులపై బలవంతంగా రంగులు చల్లితే కఠిన చర్యలు తీసుకుంటామని, ముఖ్యంగా మహిళలతో అసభ్యంగా ప్రవర్తించినా, వేధించినా, హోలీ పండుగ ముసుగులో అసాంఘిక కార్యక్రమాలు చేపడితే అలాంటి వారిపై కఠినమైన చర్యలు ఉంటాయన్నారు. గుంపులు గుంపులుగా చేరి ఇబ్బంది కలిగించే వాతావరణంలో ఈ హోలీ పండుగ జరుపుకోకూడదన్నారు.. హోలీ ఆడుతున్నప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని కనిపెట్టకొని వుండాలని, ముఖ్యంగా ఆడపిల్లలు మహిళల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. హానిపూరిత రంగులు వాడడం వల్ల కంటికి శరీరానికి హాని కలగవచ్చు కావున వారిటికి తగిన రక్షణ చర్యలు తీసుకోవడం ఉత్తమని , సహజసిద్దమైన రంగులతో ఆనందోత్సాహాలతో పండగ జరుపుకోవాలని జిల్లా ప్రజలను ఎస్పీ సూచించారు.