టీచర్ రిక్రూట్ మెంట్ రద్దుపై మమతా బెనర్జీ వ్యాఖ్యలు..

By Ravi
On
టీచర్ రిక్రూట్ మెంట్ రద్దుపై మమతా బెనర్జీ వ్యాఖ్యలు..

వెస్ట్ బెంగాల్‌లో 25 వేల మంది టీచ‌ర్ల రిక్రూట్మెంట్‌ను సుప్రీంకోర్టు ర‌ద్దు చేసిన విష‌యం తెలిసిందే. కాగా ఈ రోజు నియామక టీచ‌ర్ల‌తో సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ మీటింగ్ లో పాల్గోన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. తాను బ్ర‌తికున్నంత వ‌ర‌కు ఉద్యోగాలు కోల్పోలేర‌ని అన్నారు. టీచర్ రిక్రూట్ మెంట్ రద్దు వార్త వినగానే.. విషాదంతో త‌న గుండె రాయిలా మారింద‌ని, తాను మాట్లాడిన తీరు ప‌ట్ల త‌న‌ను జైలులో వేసే అవ‌కాశం ఉంద‌ని, ఎవ‌రైనా త‌న‌కు స‌వాల్ విసిరితే, దాన్ని ఎలా ఎదుర్కోవాలో త‌న‌కు బాగా తెలుసు అని మమతా బెనర్జీ అన్నారు. 

అదే విధంగా తాను తన ప్రజలకు ఇచ్చిన మాట‌కు క‌ట్టుబ‌డి ఉంటానని అన్నారు. అందుకే అర్హులైన వారికి ఖచ్చితంగా ఉద్యోగాలు చేజార‌కుండా చూస్తాన‌ని మమతా హామీ ఇచ్చారు. కాగా బెంగాల్ ప్రభుత్వం తాజాగా 25,753 మంది టీచర్లు, ఇతర సిబ్బందిని నియ‌మించిన సంగతి తెలిసిందే. అయితే ఆ నియామకాలను సుప్రీంకోర్టు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం చేపట్టిన నియామక ప్రక్రియ పూర్తిగా లోపాలు ఉన్నాయని కోర్టు పేర్కొంది. అంతేకాకుండా ఈ నియామకాలు అన్నీ సఫలీకృతం కావని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ క్రమంలో తృణమూల్ కాంగ్రెస్ ను రానున్న మూడు నెలల కాలంలో కొత్త నియామక ప్రక్రియను చేపట్టాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Tags:

Advertisement

Latest News

KKR vs LSG మ్యాచ్‌ – టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న అజింక్య రహానే KKR vs LSG మ్యాచ్‌ – టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న అజింక్య రహానే
ఐపీఎల్ 2025లో భాగంగా కోల్‌కతా, లక్నో జట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన కోల్‌కతా బౌలింగ్ ఎంచుకుంది. స్పెన్సర్ జాన్సన్ ఫైనల్ టీమ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.
నేడు రెండు ఐపీఎల్‌ మ్యాచ్‌లు.. 
ఇరాన్ తో అణు ఒప్పందం : ట్రంప్
అమెరికాలో ఆర్థిక మాంద్యం..!
త్వరలోనే బంగ్లాకు తిరిగొస్తా: షేక్ హసీనా
దుస్తులు విప్పించి.. మగాళ్లతో చెకింగ్.. ఎయిర్ పోర్ట్ లో దారుణం
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్..