వక్ఫ్ సవరణ చట్టానికి ఎమర్జన్సీ విచారణ అక్కర్లేదు: సుప్రీం

By Ravi
On
వక్ఫ్ సవరణ చట్టానికి ఎమర్జన్సీ విచారణ అక్కర్లేదు: సుప్రీం

ప్రస్తుతం వక్ఫ్ సవరణ చట్టంపై జమ్మూ కాశ్మీర్ లో తీవ్ర స్థాయిలో ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈ చట్టంలో సవరణలు అమల్లోకి తీసుకురావడంపై అత్యవసర విచారణ అవసరం లేదని సుప్రీం కోర్టు తెలిపింది. ఈ క్రమంలో ఈ సవరణ చట్టాన్ని అమల్లోకి తీసుకురావడాన్ని వాయిదా వేసేలా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని పిటీషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను జమియత్ ఉలేమా-ఇ-హింద్ అధ్యక్షుడు మౌలానా అర్షద్ మదాని తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు. అంతేకాకుండా ఈ పిటిషన్లను ఎమర్జెన్సీ గా లిస్ట్ చేయాలని ధర్మాసనాన్ని ఆశ్రయించారు. 

అయితే వక్ఫ్ సవరణ చట్టం 2025ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై అత్యవసర విచారణను సుప్రీంకోర్టు నేడు తిరస్కరించింది. కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని నోటిఫై చేసినప్పటి నుంచి వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై అనేక పిటిషన్లు దాఖలు అయ్యాయని సుప్రీంకోర్టు పేర్కోంది. ఈ క్రమంలో కీలక వ్యాఖ్యలు చేసింది. మన దగ్గర ఒక వ్యవస్థ ఉంది.. దానికి అనుకూలంగా ముందుకు వెళ్లాలని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ కి సీజేఐ సూచించారు. కాగా, ఈ వక్ఫ్ సవరణ చట్టం అనేది దేశ రాజ్యాంగంపై ప్రభావం చూపిస్తుందని పేర్కొంది. ముఖ్యంగా దేశంలో ఈ బిల్లు ముస్లింల మత స్వేచ్ఛపై తీవ్రమైన ప్రభావం పడుతుందని వెల్లడించారు.

Tags:

Advertisement

Latest News

KKR vs LSG మ్యాచ్‌ – టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న అజింక్య రహానే KKR vs LSG మ్యాచ్‌ – టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న అజింక్య రహానే
ఐపీఎల్ 2025లో భాగంగా కోల్‌కతా, లక్నో జట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన కోల్‌కతా బౌలింగ్ ఎంచుకుంది. స్పెన్సర్ జాన్సన్ ఫైనల్ టీమ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.
నేడు రెండు ఐపీఎల్‌ మ్యాచ్‌లు.. 
ఇరాన్ తో అణు ఒప్పందం : ట్రంప్
అమెరికాలో ఆర్థిక మాంద్యం..!
త్వరలోనే బంగ్లాకు తిరిగొస్తా: షేక్ హసీనా
దుస్తులు విప్పించి.. మగాళ్లతో చెకింగ్.. ఎయిర్ పోర్ట్ లో దారుణం
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్..