సిప్లాన్ ఫార్మా కంపెనీపై డిసిఏ దాడి.. భారీగా అక్రమ ఔషధాలు స్వాధీనం..

By Ravi
On
సిప్లాన్ ఫార్మా కంపెనీపై డిసిఏ దాడి.. భారీగా అక్రమ ఔషధాలు స్వాధీనం..

తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు దాడులతో అక్రమ వ్యాపారులకు దడ పుట్టిస్తున్నారు.  హైదరాబాద్ జోన్ అధికారులతో కలిసి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని గాజులరామారం అలీప్ ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో ఉన్న సిఫ్లాన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, యూనిట్-I లో సోదాలు నిర్వహించారు. ఈ దాడిలో కొంతమంది వెటర్నరీ ఔషధాలను అనధికారంగా  బోలసెస్ మరియు గ్రాన్యూల్స్‌ను లైసెన్స్ లేకుండా తయారు చేస్తున్నట్లు గుర్తించారు: అల్‌బెండజోల్ టాబ్లెట్స్ 250mg (బోలస్) వెటర్నరీ, అల్‌బెండజోల్ గ్రాన్యూల్స్ (వెటర్నరీ) తయారు చేసి మార్కెట్ లో విక్రయాలు జరుపుతున్నారు.  ఈ అనధికార తయారీ యూనిట్‌లో 537 కిలోల అల్‌బెండజోల్ టాబ్లెట్స్ 250mg (బోలస్) వెటర్నరీ మరియు 986 కిలోల అల్‌బెండజోల్ గ్రాన్యూల్స్ (వెటర్నరీ) నిల్వలు స్వాధీనం చేసుకున్నారు. దాడి సమయంలో అధికారులు రూ. 3 లక్షల విలువైన ఔషధాల నిల్వలును స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో అధికారులు: కె. ప్రభాకర్, అసిస్టెంట్ డైరెక్టర్, కుత్బుల్లాపూర్; ఐ. శ్రీకాంత్, డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్, గజులరామారం; కె. నవీన్ రెడ్డి, డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్, CDSCO-హైదరాబాద్ జోన్; మరియు ఎం. విక్రమ్, డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్, CDSCO-హైదరాబాద్ జోన్ పాల్గొన్నారు.

Advertisement

Latest News

స్వామివారి సన్నిధిలో..చచ్చేలా కొట్టుకున్నారు.. స్వామివారి సన్నిధిలో..చచ్చేలా కొట్టుకున్నారు..
తమిళనాడు: అరుణాచలం.. ఇప్పుడు ఉన్న దేవాలయాల్లో ఇది చాలా ఫేమస్ అయ్యింది. లక్షల్లో జనాలు స్వామివారి దర్శనం.. ప్రదక్షిణం కోసం వెళ్తున్నారు. మిగతారోజుల మాట సరే.. సెలవు...
జులై 11న లాల్ దర్వాజ అమ్మవారి బోనాలు..
డేట్ ఫిక్స్ అయ్యింది.. సార్ వస్తున్నారు.. గెట్ రెడీ..
ఆయన పనితీరు ఎస్టి ఎఫ్ టీమ్‌లకు ఎంతో ఉపయోగపడింది. ఎక్సైజ్ డైరెక్టర్‌ షానవాజ్‌ ఖాసీం..
బాధితుల ఫిర్యాదులను నమోదు చేయండి: డిజిపి డాక్టర్ జితేందర్..
అక్షయ విద్య ఫౌండేషన్ ను అభినందించిన డీజీపీ జితేందర్..
దాడులతో దడపుట్టిస్తున్న ఎక్సైజ్ టీమ్స్.. భారీగా డ్రగ్స్ స్వాధీనం.