హైకోర్టులో గాలి అప్పీల్.. రెగ్యులర్ కోర్టులో వింటామన్న ధర్మాసనం
By Ravi
On
ఓబులాపురం మైనింగ్ కేసుపై హైకోర్టు లో విచారణ జరిగింది. సీబీఐ కోర్ట్ ఇచ్చిన తీర్పును హైకోర్టులో గాలి జనార్ధన్ తో పాటు మరో ముగ్గురు నిందితులు బెయిల్ దాఖలు చేశారు. దీనిపై సీబీఐ కౌంటర్ సైతం దాఖలు చేసింది. గాలి జనార్దన్ రెడ్డి అప్పీల్ పిటిషన్ విచారించేందుకు హైకోర్టు వెకేషన్ బెంచ్ నిరాకరించింది. మరో నలుగురి అప్పీల్ పిటిషన్లను తోసిపుచ్చింది. వేసవి సెలవుల తర్వాత రెగ్యులర్ కోర్టులోనే వాదనలు వింటామని హైకోర్టు స్పష్టం చేసింది. చంచల్ గూడ జైల్ లో ఉన్న గాలి జనార్దన్ రెడ్డి, అలీఖాన్ ను పిటి వారెంట్ కింద బెంగుళూరు తరలించారు.
Latest News
29 May 2025 20:45:12
తాండూరు: చదువుకున్న ప్రతి నిరుద్యోగ యువతకు ఉద్యోగం కల్పించాలన్నదే తన లక్ష్యం అని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. గురువారం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో తెలంగాణ...