గాలిజనార్ధన్ రెడ్డిని బెంగుళూరికి తరలింపు...
By Ravi
On
ఓఎంసీ కేసులో చంచల్‌గూడ జైలులో ఉన్న గాలిజనార్ధన్ రెడ్డిని పోలీసులు బెంగుళూరికి తరలించారు. పీటీ వారెంట్‌పై గాలి జనార్దన్‌రెడ్డి, అలీఖాన్‌ను భారీ బందోబస్తు నడుమ ప్రత్యేక వాహనాల్లో తరలించారు. బెంగళూరులో గాలి జనార్దన్‌రెడ్డిపై పలు కేసులు ఉన్నాయి. ఇప్పటికే ఓఎంసీ కేసులో గాలి జనార్దన్‌రెడ్డికి ఏడేళ్ల జైలుశిక్ష విధించిన సీబీఐ కోర్టులో ఇటీవలే ఆయన తనకు జైల్ లో ప్రత్యేక క్యాటగిరి ఇవ్వాలని పిటిషన్ కూడా వేశారు. గాలి అండ్ గ్యాంగ్ సభ్యులు నలుగురు హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా సీబీఐ కౌంటర్ కూడా దాఖలు చేసి బెయిల్ ఇవ్వొద్దని హైకోర్టుని కోరింది.
Latest News
29 May 2025 08:31:54
కాంగ్రెస్ కార్పొరేటర్ వేధింపులకు బీ ఆర్ ఎస్ నేత బలైపోయాడు. బోరబండ డివిజన్ బీఆర్ఎస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు సర్దార్(30) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత కొన్ని నెలలుగా...