గోడవపడుతున్నాడని భర్తను హత్య చేసిన భార్య..
By Ravi
On
వనస్థలిపురం లో దారుణం జరిగింది. భర్తను హత్యచేసి ప్రమాదవశాత్తూ ఇంట్లో పడి చనిపోయాడు అని నమ్మించే యత్నం చేసింది ఓ భార్య. 8సంవత్సరాల క్రితం శిరీషను కిషన్ నాయక్ కులాంతర వివాహం చేసుకున్నాడు. నారాయణపురంకు చెందిన కిషన్ నాయక్ కు శిరీషకు మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. దీనితో భర్త ను వదిలి వనస్థలిపురం హిల్స్ కాలనీ లో ఒంటరిగా ఉంటోంది. పథకం ప్రకారం భర్తను ఇంటికి పిలిచి చున్నీతో ఉరివేసి హత్య చేసింది. కిషన్ నాయక్ కుటుంబ సభ్యుల పిర్యాదుతో హత్య ఉదంతం బయటపడింది. ఈ కేసులో శిరీషతో సహా మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Related Posts
Latest News
28 May 2025 19:53:33
జూబ్లీహిల్స్‌లోని బేబీలాన్ పబ్‌లో తాము ఆర్డర్ చేయని డ్రింక్స్‌కు బిల్ వేశారని ప్రశ్నించినందుకు సిబ్బంది కస్టమర్లపై దాడికి పాల్పడ్డారు. పబ్‌లో లైట్లు ఆర్పేసి తన తల్లి, చెల్లిని...