రోడ్డునపడిన కుటుంబం.. కెఎల్ఆర్ సహాయం..

By Ravi
On
రోడ్డునపడిన కుటుంబం.. కెఎల్ఆర్ సహాయం..

మహేశ్వరం మండలం డిజె తండాలో ఓ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఇటీవల కురిసిన వర్షానికి పిడుగు పడి 50 మూగజీవాలు మృతి చెందాయి. దీనితో వాటిపై ఆధారపడ్డ ఓ కుటుంబం రోడ్డున పడింది. ఈ విషయం తెలుసుకున్న మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి  KLR ట్రస్టు ద్వారా 50వేల ఆర్థిక సహాయం అందజేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేప భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో బాధిత కుటుంబ సభ్యులకు డబ్బులు అందజేశారు. భారీ వర్షాలకు పంటలు నష్టపోవడమే కాకుండా మూగజీవలు సైతం అనారోగ్యం పాలవుతున్నాయని దేప భాస్కర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పిడుగుపాటు, వీధి కుక్కల దాడిలో 50 గొర్రెలు - మేకలు మృత్యువాత పడటం రైతుకు తీవ్ర నష్టం వాటిల్లిందని కాంగ్రెస్ నేతలు తెలిపారు. నష్టపోయిన వారికి ప్రభుత్వ సహాయం అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్యా నాయక్, కూన యాదయ్య, కాకి ఈశ్వర్ ముదిరాజ్, వత్తుల రఘుపతి, బంగారు గల్లా, లాజర్, సేవాదళ్ అధ్యక్షుడు హరికృష్ణ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అల్లే బిక్షపతి, సేవియా నాయక్, గోపాల్ నాయక్, మోహన్ నాయక్, రామావత్ గోపాల్, మెగావత్ అర్య, రమావత్ యాది తదితరులు పాల్గొన్నారు.IMG-20250528-WA0046

Advertisement

Latest News

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలే మాకు ముఖ్యం. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి.. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలే మాకు ముఖ్యం. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి..
తాండూరు: చదువుకున్న ప్రతి నిరుద్యోగ యువతకు ఉద్యోగం కల్పించాలన్నదే తన లక్ష్యం అని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. గురువారం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో తెలంగాణ...
ఈ నిర్ణయాలు తీసుకుంటేనే.. ఆ సమస్యలు దూరం..
రైతుల కష్టం.. వర్షంతో నష్టం..
ప్రజలు ఎప్పుడు శాంతియుత వాతావరణాన్ని కోరుకుంటారు. డీజీపీ జితేందర్..
ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం...
వ‌ర‌ల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిలో కండ‌క్ట‌ర్ కుమారుడి స‌త్తా..
వాతావరణ శాఖ అధికారులతో.. టిజిఐసిసిసి డైరెక్టర్ సమావేశం..