ఈ స్పెషల్ రూల్స్ మీ కోసం...

By Ravi
On
ఈ స్పెషల్ రూల్స్ మీ కోసం...

వాహనదారులకు బ్యాడ్ న్యూస్..
హైవేలో ఓవర్ స్పీడ్ జరిమానా తరహాలో ఇక చలాన
ఒక్కసారి సిసి కెమెరాలో క్లిక్ అంటే.. వాహనం డిటైల్స్ మొత్తం డిస్ ప్లే..

Sr. Reporter. V. Krishna kumar
Tpn.. స్పెషల్ డెస్క్..


వాహనదారులకు ఓ చేదువార్త.. బ్యాడ్ న్యూస్ అంటే ఏదో సాదాసీదా కాదు.. చిన్నపొరపాటు చేసిన ఇక మీరు అడ్డంగా బుక్కైనట్లే.. మీ పర్సులు ఖాళీ అయి.. జేబులకు చిల్లులు పడినట్లే.. పక్కనే కదా అని ఏమాత్రం రూల్స్ ఫాలో కాకపోయినా భారీ వడ్డన తప్పదు.. ఏంటి ఇది ఎప్పుడు రొటీన్ న్యూసే.. ఇందులో కొత్తగా ఏముంది అనుకుంటున్నారా.. అక్కడికే వస్తున్నా..

319980e5-6c40-434c-a594-6704573366cfసాధారణంగా వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీసులు వాహనం అపి చలన రాసేవారు.. తరువాత ట్రాఫిక్ కూడలి వద్ద సిసి కెమెరాలకో.. కానిస్టేబుల్ సెల్ ఫోన్ కో చిక్కితే మన బ్రేక్ చేసిన రూల్స్ కి సంబంధించి ఫోటో, వీడియోతో ఆన్ లైన్ లో జరిమానా విధిస్తారు. ఇది అందరికీ తెలిసిందే.. రొటీన్ అంటూ చాలా మంది తేలిగ్గా తీసుకుంటారు. ఇటీవలే కేంద్రం అన్ని రాష్ట్రాలకు భద్రత విషయంలో ఆదేశాలు జారీ చేసింది. ప్రతి వాహనానికి హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్స్ ఉండాలి అని, సెప్టెంబర్ లోగా అందరూ వాటిని ఏర్పాటు చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. 
ఇక్కడి వరకు బాగానే ఉంది. మన సిటీ పోలీసులు మరో అదిరిపోయే ఆఫర్ తీసుకు వచ్చారు. రోడ్లపై ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే దానికి సంబంధించిన చలన మాత్రమే వస్తుంది అనుకోకండి. కూడలి వద్ద ఉన్న సిసి కెమెరాల్లో క్లిక్ అనే ఫొటోస్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్, కమాండ్ కంట్రోల్ రూమ్ కి చేరి ఆ వాహనానికి పొల్యూషన్, ఇన్సూరెన్స్ ఉందా.. లేదా.. ఆర్సీ సరిగా ఉందా, నెంబర్ ప్లేట్ ఎలా ఉంది, సెల్ ఫోన్ డ్రైవింగ్, నో హెల్మెట్ ఇలా అన్ని ఆటోమేటిక్ గా సర్చ్ అయి వాటిలో ఏది లేకపోయినా మీ రూల్స్ బ్రేక్ తో పాటు అవి కలిపి జరిమానా మీ ఇంటికి వస్తుంది.. ఇది నిజం.. ఎలా అంటే హైవేల మీద మీ వాహనం ఓవర్ స్పీడ్ వెళ్తే ఎలా చలాన వస్తుందో అచ్చం అలానే.. ప్రతి సిసి కెమెరా మీ వాహనాన్ని అబ్జర్వ్ చేస్తూ ఏ డాక్యుమెంట్ లేకపోయినా ఆ వాహనం నెంబర్ ప్లేట్ ఆధారంగా జరిమానా వచ్చేలా అన్నమాట.. మీరు ఏడాదికోసారి ఇన్సూరెన్స్, అలాగే ఎప్పటికప్పుడు పొల్యూషన్ చేయిస్తూ ఉంటే ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతుంది.. ఈ విధానం కోసం తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ డైరెక్టర్ వి.బి. కమలాసన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్టీఏ అధికారులతో ఓ సమావేశం ఏర్పాటు చేశారు. అందులో ట్రాఫిక్, ఆర్టీఏ కలిసి కమాండ్ కంట్రోల్ లో కలిసి పని చేసేలా ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి. ఆర్టీఏ అధికారుల వద్ద ఉన్న వాహనాల డేటా బేస్ మొత్తం కలిపి ఈ చలనాకు జత చేశారు. వాహనం ఏదైనా మొత్తం వివరాలతో జరిమానా వచ్చేలా చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లోనే ఈ అవకాశం మనకు కలగనుంది.. అంటే ఈ కొత్త రూల్స్ స్టార్ట్ కాబోతున్నాయి..
ఒకవేళ ఎవరైనా జరిమానా వచ్చిన వారం రోజుల్లో చెల్లించక పోతే వడ్డిమీద వడ్డీ వేసి మీ నడ్డి విరగగొట్టడమే కాకుండా.. ఛార్జ్ షీట్, కోర్ట్, జైల్ అన్ని క్షణాల్లో జరిగిపోతాయి.. పక్కనే కదా అని హెల్మెట్ లేకుండా వెళ్లిన, ఇన్సూరెన్స్, పొల్యూషన్ లేకపోయినా ప్రతిసారి అవి కలిసి జరిమానా వస్తుంది అంటే చలన ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పనక్కరలేదు. రోడ్లపై ఇష్టానుసారంగా వెళ్లిన రాంగ్ రూట్, జీబ్రా లైన్ క్రాస్, రెడ్ లైట్ జంప్ వీటన్నింటికి జరిమానా పెరిగిన సంగతి, మైనర్లకు బండి ఇస్తే దాని యజమాని, తల్లిదండ్రులకు జైల్ మనకు తెలుసు. ఇక వాహనం విషయంలో వాటితో పాటు మిగతా డాక్యుమెంట్ల వ్యవహారం కూడా కలిసి మన సెల్ కి మెసేజ్ ల రూపంలో చేరుతాయి.
ఈ విధానం వల్ల రోడ్లపై తమ పోలీసులు వాహనాలు ఆపి డాక్యుమెంట్లు చెక్ చేసే అవకాశం ఇక ఉండదని, సిసి కెమెరాల ద్వారా ఆటోమేటిక్ గా అన్ని గుర్తించడం జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. మొదటి విడతగా  హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల కలుపుతున్నారు.. ఆ తరువాత మొత్తం తెలంగాణ రాష్ట్రం లో ఉన్న అన్ని సిసి కెమెరాలు tgiccc.. తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కి జత చేయడం జరుగుతుంది. అర్ధం అయ్యింది కదా.. ఇక రూల్స్ పాటించండి.. ప్రశాంతంగా ప్రయాణించండి.. జరిమానా లేని ప్రయాణాలతో సాగిపోండి.. ఆల్ ది బెస్ట్..

Advertisement

Latest News

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలే మాకు ముఖ్యం. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి.. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలే మాకు ముఖ్యం. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి..
తాండూరు: చదువుకున్న ప్రతి నిరుద్యోగ యువతకు ఉద్యోగం కల్పించాలన్నదే తన లక్ష్యం అని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. గురువారం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో తెలంగాణ...
ఈ నిర్ణయాలు తీసుకుంటేనే.. ఆ సమస్యలు దూరం..
రైతుల కష్టం.. వర్షంతో నష్టం..
ప్రజలు ఎప్పుడు శాంతియుత వాతావరణాన్ని కోరుకుంటారు. డీజీపీ జితేందర్..
ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం...
వ‌ర‌ల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిలో కండ‌క్ట‌ర్ కుమారుడి స‌త్తా..
వాతావరణ శాఖ అధికారులతో.. టిజిఐసిసిసి డైరెక్టర్ సమావేశం..