గిరిజన ఉద్యోగులకు 100% జీతాలు చెల్లింపు..కృతజ్ఞతలు తెలిపిన గిరిజన సంఘాలు..
తెలంగాణా గిరిజన సహకార సంస్థ నందు పనిచేయుచున్న ఉద్యోగులందరికీ 100% జీతాలు విడుదల చేయడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా మారుమూల గిరిజన ప్రాంతాలలో పనిచేయుచున్న ఉద్యోగులందరు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు తరువాత పూర్తి స్థాయి జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఉద్యోగుల బాధలను సానుభూతితో విని సమస్యను పరిష్కరించిన పంచాయతీ రాజ్ మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్కకి ప్రతి ఉద్యోగులు కృతజ్ఞతలు తెలియజేశారు. TGGCC కి సరిపడా నిధులను కేటాయించి సంస్థ ఉద్యోగుల కుటుంబాలలో వెలుగులు నింపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రతి ఉద్యోగి రుణపడి ఉంటామని జీసీసీ ఉద్యోగం సంఘ నాయకులు తెలియజేశారు. ఉద్యోగుల సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉండి వారి వేతనాల సమస్య పరిష్కారానికి కృషి చేసిన చైర్మన్ కోట్నాక్ తిరుపతికి మరియు గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి . A శరత్, IAS గారికి ఉద్యోగులందరి తరుపున ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్బంగా సంస్థ ఉద్యోగ సంఘ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గిరిజన సంక్షేమానికి చేపట్టే ప్రతి కార్యక్రమంలో తమ వంతు పాత్ర నెరవేరుస్తూ గిరిజనుల అభివృద్ధికి పాటు పడతామని అన్నారు.