మొబైల్స్ లో గేమ్స్ వద్దు అన్నందుకు విద్యార్థి ఆత్మహత్య..
By Ravi
On
వీడియో గేమ్ ఆడుతూ .టివి చూస్తూ సరిగా చదవడంలేదని కొడుకును తల్లి మందలించడంతో కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వినయా నగర్ లోని రాధారెసిడెన్సీలో కంబాలపల్లి సుజాత, వెంకటయ్య కుటుంబం వాచ్ మెన్ గా జీవనం సాగిస్తున్నారు. వీరి పెద్దకు మారుడు కం బాలపల్లి రిషి(16) ఇటీవల పదో తరగతిలో ఫెయిల్ అయ్యాడు. దీంతో మానసిక ఒత్తిడికి గురికావడంతో కుటుంబసభ్యులు ధైర్యం చెప్పారు. త్వరలో జరగబోయే సప్లిమెం టరీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేందుకు ట్యూషన్ పెట్టించారు. ఈ క్రమంలో శనివారం ఇంట్లో ఫోన్లో మొబైల్ గేమ్ ఆడుతుండగా తల్లి మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన రిషి అపార్ట్మెంట్ పైకి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సైదాబాద్ పోలీ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Tags: #saidabadpolice#
Related Posts
Latest News
28 May 2025 19:53:33
జూబ్లీహిల్స్‌లోని బేబీలాన్ పబ్‌లో తాము ఆర్డర్ చేయని డ్రింక్స్‌కు బిల్ వేశారని ప్రశ్నించినందుకు సిబ్బంది కస్టమర్లపై దాడికి పాల్పడ్డారు. పబ్‌లో లైట్లు ఆర్పేసి తన తల్లి, చెల్లిని...