గుంటూరు జీజీహెచ్ కి వల్లభనేని వంశీ

By Ravi
On
గుంటూరు జీజీహెచ్ కి వల్లభనేని వంశీ

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi)ని మెరుగైన చికిత్సకోసం గుంటూరు జీజీహెచ్ కి తరలించారు.

vallabhaneni-vamsi-suffers-sudden-illness-while-in-police-station_b_2405251158గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi)ని మెరుగైన చికిత్సకోసం గుంటూరు జీజీహెచ్ కి తరలించారు. వివరాల్లోకి వెళితే...నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో  రెండు రోజుల క్రితం కంకిపాడు పోలీస్ కస్టడీలో ఉండగా ఆయనకు ఆకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణించింది. అప్రమత్తమయిన పోలీసులు  వెంటనే వంశీని కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కోర్టు ఆదేశాల మేరకు ఆయనకు రెండు సార్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్యులు ఆయన శ్వాసకోశ సమస్యలను గుర్తించి, అవసరమైన చికిత్సను అందించారు. మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్ కు ఈ రోజు ఉదయం తరలించారు. ఈ సందర్భంగా పోలీసుల హడావుడితో ఆసుపత్రి ప్రధాన ద్వారం మూసివేయడంతో రోగులు అనేక అవస్థలకు గురవుతున్నారు. రైల్వే స్టేషన్ వైపు వున్నద్వారం నుంచి రోగులు లోపలకు రావాలని పోలీసులు కోరుతున్నారు.

Tags:

Advertisement

Latest News