సినిమా హాళ్ల నిర్వహణ పకడ్బందీగా ఉండాలి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

నా సినిమా అయినా సరే టికెట్ ధరల పెంపు కావాలంటే ఫిలిం ఛాంబర్ ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించాలి

By Ravi
On
సినిమా హాళ్ల నిర్వహణ పకడ్బందీగా ఉండాలి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

అమరావతి: రాష్ట్రంలో సినిమా హాళ్ల నిర్వహణను పకడ్బందీగా చేపట్టడం ద్వారా ప్రేక్షకులకు మెరుగైన సేవలు అందించాలని... ఆ దిశగా సంబంధిత ప్రభుత్వ శాఖలు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. జనసేన కార్యాలయం నుండి విడుదల చేసిన లేఖలో కీలక సూచనలు చేశారు. కొత్త చిత్రాలు విడుదల సందర్భంలో టికెట్ ధరల పెంపు నిమిత్తం నిర్మాతలు, వారికి సంబంధించినవారు వ్యక్తిగత హోదాలో కాకుండా తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించే విధానాన్ని అమలు చేయాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారు - సినిమాలు హాళ్ల బంద్ ప్రకటనలు, ఈ క్రమంలో తమ శాఖ ద్వారా చేపట్టిన చర్యలను, తాజా పరిణామాలను ఉప ముఖ్యమంత్రివర్యులకు వివరించారు.  

టికెట్ ధరల పెంపు కావచ్చు, సినిమా హాళ్ల నిర్వహణ విషయం కావచ్చు... ఏ విషయంలోనైనా ప్రభుత్వ శాఖలు తమ విధులను, పర్యవేక్షణను పకడ్బందీగా చేయాలన్నారు. త్వరలో విడుదలయ్యే హరిహర వీరమల్లు సినిమాకు సైతం టికెట్ ధరల పెంపు కోసం నిర్మాత వ్యక్తిగతంగా కాకుండా చలనచిత్ర వాణిజ్య మండలి ద్వారానే ప్రభుత్వానికి అర్జీ ఇచ్చి, సంప్రదింపులు చేయాలని... ఇందులో తనమన బేధాలు పాటించవద్దు అని స్పష్టంగా చెప్పారు.

టికెట్ ధర కంటే సినిమా హాల్లో తినుబండారాలు, తాగునీటి ధరలు. వాటి నాణ్యత పై సైతం సంబంధిత శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ధరల నియంత్రణ కూడా చేపట్టాలని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మల్టీప్లెక్సులు, సింగిల్ స్క్రీన్స్ లో ఆహార పదార్థాలు, శీతల పానీయాల వ్యాపారంలోను గుత్తాధిపత్యం సాగుతోందనే విషయం కూడా ప్రభుత్వ దృష్టికి వచ్చినందున దీనిపై విచారణ చేపట్టాలని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రికి సూచించారు. తెలుగు చిత్ర రంగంలో సినిమా హాళ్ల బంద్ ప్రకటనలు వెలువడటానికి గల కారణాలను పరిశీలించి....తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలికి, నిర్మాతల మండలికి, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, దర్శకుల సంఘాలకు తెలియచేయాలన్నారు. అదే విధంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తీసుకురాదలచిన కాంప్రహెన్సివ్ ఫిలిం డెవలప్మెంట్ పాలసీలో సినిమా రంగం అభివృద్ధికి సూచనలను కూడా తెలుగు సినిమా రంగంలోని సంఘాలు, మండళ్ల నుంచి స్వీకరించాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు.

Advertisement

Latest News

పబ్ నిర్వాహకుల దౌర్జన్యం.. లైట్లు తీసి మరి మహిళలపై దాడి.. పబ్ నిర్వాహకుల దౌర్జన్యం.. లైట్లు తీసి మరి మహిళలపై దాడి..
జూబ్లీహిల్స్‌లోని బేబీలాన్ పబ్‌లో తాము ఆర్డర్ చేయని డ్రింక్స్‌కు బిల్ వేశారని ప్రశ్నించినందుకు సిబ్బంది కస్టమర్లపై దాడికి పాల్పడ్డారు. పబ్‌లో లైట్లు ఆర్పేసి తన తల్లి, చెల్లిని...
కొండాపూర్ లో హైడ్రా కూల్చివేతలు..
పెండింగ్ లో ఉన్న యుఐ కేసులను వెంటనే పరిష్కరించాలి. సీపీ సుధీర్ బాబు..
గిరిజన ఉద్యోగులకు 100% జీతాలు చెల్లింపు..కృతజ్ఞతలు తెలిపిన గిరిజన సంఘాలు..
ఈ స్పెషల్ రూల్స్ మీ కోసం...
TGiCCCలో RTA డేటాబేస్ అనుసంధానం..
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఆర్ఐ...