ఘోర రోడ్డు ప్రమాదం. కానిస్టేబుల్ మృతి.. మరో ముగ్గురికి గాయాలు
By Ravi
On
శంషాబాద్ వద్ద బెంగళూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వాహనాల తనిఖీ చేస్తున్న పోలీస్ పెట్రోలింగ్ వాహనాని లారీ ఢీకొంది. ప్రమాదంలో విజయ్ కుమార్ అనే కానిస్టేబుల్ మృతి చెందగా మరో ముగ్గురు కానిస్టేబుల్ లకు గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను సమీపంలోని హాస్పిటల్ కు తరలించిన పోలీసులు లారీ డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నారు. లారీ డ్రైవర్ మితిమీరిన వేగంతో రావడం అదుపుతప్పి ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
శంషాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతి చెందిన కానిస్టేబుల్ విజయ్ కుమార్ శంషాబాద్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా గుర్తింపు.
Tags:
Latest News
25 May 2025 08:25:29
కర్నాటకలో రామలింగ మఠాధిపతి లోకేశ్వరస్వామిని పోలీసులు అరెస్ట్ చేశారు. బెళగావిలో 17 ఏళ్ల యువతి పై స్వామీజీ అత్యాచారం చేశాడు. రాయచూర్‌లోని ఓ లాడ్జిలో 2 రోజుల...