విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ అగ్నిప్రమాదం..
By Ravi
On
విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఈ ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్లాంట్ లోని స్టీల్ మెల్టింగ్ స్టేషన్-2 (ఎస్ఎంఎస్-2) విభాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అక్కడ దట్టమైన పొగలు అలుముకున్నాయి. ప్లాంట్ వర్గాల సమాచారం ప్రకారం, ఎస్ఎంఎస్-2లోని ఒక పైప్‌లైన్ దెబ్బతినడంతో ఆయిల్ లీకై మంటలు వ్యాపించాయి. ప్రమాదాన్ని గమనించిన సిబ్బంది వెంటనే అప్రమత్తమై అగ్నిమాపక విభాగానికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న స్టీల్ ప్లాంట్ అగ్నిమాపక దళాలు, రెస్క్యూ టీమ్‌లు మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే, భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ప్రమాద తీవ్రత, నష్టంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Tags:
Latest News
23 May 2025 21:58:53
శంషాబాద్ విమానాశ్రయంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. నా కుమారుడి గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి వెళ్లిన తర్వాత లేఖ లీక్ అయి హంగామా జరిగినట్లు తెలిసిందని,...