ఎక్స్ లోకి అడుగుపెట్టిన డిసిఏ..
By Ravi
On
సోషల్ మీడియా వేదికగా ఇక డిసిఏ తమ సేవలు అందించేందుకు సిద్దమైంది. ఇందుకు గాను
తెలంగాణ ప్రభుత్వానికి చెందిన డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ తన అధికారిక X (మునుపటి ట్విట్టర్) ను ప్రారంభించింది. @DCATelangana క్రియాశీలంగా పనిచేస్తోందని. ఈ ప్లాట్‌ఫామ్ లో శాఖ చేపట్టిన చర్యలు మరియు కార్యక్రమాలను పంచుకోవడం, ప్రజలకు అవగాహన కల్పించేందుకు సాధారణ సమాచారాన్ని అందించడం, ప్రజారోగ్యానికి సంబంధించి ఔషధాలు మరియు ఔషధ పరంగా జారీ చేసే హెచ్చరికలను చేయడం, వీటితోపాటు ప్రజల నుండి ఫిర్యాదులు మరియు సూచనలను స్వీకరించడం జరుగుతుందని అధికారులు తెలిపారు. నకిలీ ఔషధాలు వాటిని అరికట్టడంలో ఫిర్యాదు విషయంలో కూడా ప్రజలు ఎక్స్ వేదికగా ఫిర్యాదు చేయవచ్చని, ఆయా కంప్లైంట్స్ పై తక్షణమే అధికారులు రంగంలోకి దిగి చర్యలు తీసుకుంటామన్నారు.
Tags:
Latest News
22 May 2025 21:21:43
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీలు కీలక దశకు చేరుకున్నాయి. 24 మంది ఫైనలిస్టుల జాబితాను మిస్ వరల్డ్ నిర్వాహక సంస్థ ప్రకటించింది. ఈ...