కార్యకర్తల కుటుంబాలకు అండగా నిలిచిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
పటాన్‌చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తన ఔదార్యాన్ని మరోసారి చాటుకున్నారు. రుద్రారం గ్రామంలో CSR నిధులతో నిర్మిస్తున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవన నిర్మాణానికి, అసైన్‌మెంట్ భూమి లబ్ధిదారులైన జొన్నాడ మహేష్, జహంగీర్ లకు తన సొంత నిధుల నుంచి చెరో ₹5 లక్షల చొప్పున మొత్తం ₹10 లక్షలు అందజేశారు. పాఠశాల నిర్మాణం పూర్తయితే నిరుపేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందుతుందని ఆయన ఆకాంక్షించారు.అంతేకాకుండా, ఇటీవల మరణించిన పార్టీ కార్యకర్త కురుమ నరసింహులు కుటుంబానికి ₹1 లక్ష ఆర్థిక సహాయం అందించి, భవిష్యత్తులో వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే దాతృత్వం పట్ల గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాల్లో మాజీ ఎం.పి.పి. శ్రీశైలం యాదవ్, మాజీ సర్పంచ్ సుధీర్ రెడ్డి, పి.ఎ.సి.ఎస్. చైర్మన్ పాండు, సీనియర్ నాయకులు వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.