ముఖ్యమంత్రి సహాయనిధి పేదల పాలిట వరం.. నీలం మధు

By Ravi
On
ముఖ్యమంత్రి సహాయనిధి పేదల పాలిట వరం.. నీలం మధు

ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) పేదల పాలిట వరమని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ నేత నీలం మధు అభివర్ణించారు. పటాన్ చెరువు నియోజకవర్గానికి చెందిన నలుగురు లబ్ధిదారులకు ₹2,45,000/- విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ, అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఆర్థిక భరోసా కల్పిస్తుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం పేదల వైద్యానికి పెద్దపీట వేస్తోందని, రాజీవ్ ఆరోగ్యశ్రీని బలోపేతం చేసి మరిన్ని వ్యాధులకు ఉచిత చికిత్సను అందుబాటులోకి తెచ్చిందని వివరించారు. ఈ కార్యక్రమంలో తెల్లాపూర్ మున్సిపాలిటీ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గడ్డం శ్రీశైలం, మాజీ ఎంపీటీసీ హరిప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Advertisement

Latest News

మిస్ వరల్డ్ ఫైనల్ లిస్ట్ లో 24మంది మిస్ వరల్డ్ ఫైనల్ లిస్ట్ లో 24మంది
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీలు కీలక దశకు చేరుకున్నాయి. 24 మంది ఫైనలిస్టుల జాబితాను మిస్ వరల్డ్ నిర్వాహక సంస్థ ప్రకటించింది. ఈ...
కవిత లేఖ.. బిఆర్ఎస్ లో లుకలుక
ఇటుకబట్టీల్లో చైల్డ్ లేబర్.. అధికారుల సీరియస్
సీఎం ఓఎస్డి అంటూ మాజీ క్రికెటర్ బెదిరింపులు.. అరెస్ట్
బక్రీద్ పండుగ సందర్భంగా పోలీసుల సమన్వయ సమావేశం
కార్యకర్తల కుటుంబాలకు అండగా నిలిచిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
ఎక్స్ లోకి అడుగుపెట్టిన డిసిఏ..