ఆపరేషన్ కగార్.. బాబుపై బాంబుదాడి సూత్రదారి మృతి
చత్తీస్ ఘడ్ అడవుల్లో తుపాకుల మోత మోగుతోంది. మా వోయిస్టులను భద్రతా దళాలు చుట్టు ముట్టాయి. దీంతో, మరోసారి భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఆపరేషన్ కగార్ దూకుడు కొనసాగుతోంది. దాదాపు 28 మంది మావోయిస్టులు ఈ ఎన్ కౌంటర్ లో మరణించినట్లు తెలుస్తోంది. ఇందులో చంద్రబాబు పైన అలిపిరి లో బాంబుదాడి సూత్రధారి నంబాల కేశవరాజు అలియాస్ బసవరాజు మరణించినట్లు సమాచారం. మాధ్ ప్రాంతంలో పెద్దఎత్తున మావోయిస్టులు ఉన్నట్టు సమాచారం అందడంతో బీజాపూర్, నారాయణపూర్, దంతేవాడ భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలోనే మావోయిస్టులు తారసపడి కాల్పులు జరపడం వల్ల భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపాయి. ఈ ఎన్ కౌంటర్ లో 28 మంది మవోయిస్టులు మరణించినట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ ఎదురు కాల్పుల్లో పోలీసు సహాయకుడు ఒకరు మృతి చెందినట్లు చత్తీస్గఢ్ హోంమంత్రి విజయ్ వర్మ తెలిపారు.
ఉదయం నుంచి భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య భారీగా ఎదురు కాల్పులు జరుగుతు న్నట్టు సమచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మరణించినట్లు ప్రచారం జరుగు తోంది. బసవరాజు ఉన్నారన్న సమాచారంతో మాధ్ ప్రాంతాన్ని బలగాలు చుట్టుముట్టినట్టు తెలుస్తోంది. నంబాల కేశవరావుపై కోటిన్నర రివార్డు ఉందని పోలీసులు తెలిపారు. గణపతి రాజీనామాతో పార్టీకి సుప్రీం కమాండర్ బాధ్యతలను నంబాల కేశవరావు నిర్వహించారు. నంబాల కేశవరావు స్వస్థలం శ్రీకాకుళం జిల్లా జియ్యన్నపేట. తూర్పు గోదావరి, విశాఖలో మావోయిస్టు పార్టీలో పనిచేశారు. పీపుల్స్వార్ వ్యవస్థాపకుల్లో నంబాల కేశవరావు ఒకరు. మావోయిస్టు సెంట్రల్ మిలిటరీ కమిషన్ అధిపతిగా నంబాల కేశవరావు పనిచేశారు.