చదివింది విదేశాల్లో.. డ్రగ్స్ వ్యాపారం స్వదేశంలో

By Ravi
On
చదివింది విదేశాల్లో.. డ్రగ్స్ వ్యాపారం స్వదేశంలో

వారంతా విదేశీ చదువులు అభ్యసించారు.నైజీరియన్స్ తో దోస్తాని చేసి డ్రగ్స్ వ్యాపారంలోకి దిగారు. చేతి నిండా డబ్బులు వస్తున్నాయని సంబరపడే లోపు ఎక్సైజ్ అండ్ ఫోర్స్ మెంట్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసి క్రమంలో ఎస్టిఎఫ్  మహిళా ఎస్ఐ సంధ్య మరో కానిస్టేబుల్ పై దాడి చేసి తప్పించుకునే ప్రయత్నాలు చేశారు. వరుణ్ ప్రభువు చైతన్య వీరిద్దరు అన్నదమ్ములు. లండన్ లో ఉన్నత చదువులు చదివారు. ఇండియాకు వచ్చి చదువుకున్న చదువులతో ఉన్నతమైన వ్యాపారము విద్యాసంస్థలు నడుపుకోవాల్సిన వారు, డ్రగ్స్, గంజాయి వ్యాపారం లోకి దిగారు. తరచూ బెంగళూరు వెళుతూ అక్కడి నుంచి నైజీరియా వ్యక్తుల వద్ద ఉన్న పరిచయాలతో డ్రగ్సును హైదరాబాద్ కు తీసుకువచ్చి కిరణ్ తో పాటు మరికొంతమందితో అమ్మకాలు జరిపిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.  ఎండిఎంఏ  డ్రగ్స్, ఓజి కుష్ ను అమ్మకాలు జరుపుతుండగా ముగ్గురిని ఎస్టిఎఫ్ పోలీసులు పట్టుకున్నారు.  ముగ్గురిలో వరుణ్, ప్రభు చైతన్య, కిరణ్ ఉన్నారు. మిగిలిన వారిలో   వంశీ,సాయి కృష్ణ,నందు సాయిలు పై కూడా కేసు నమోదు చేశారు. వీరు పరారీలో ఉన్నట్లు ఎస్టిఎఫ్ ఎస్ఐ బాలరాజు, సంధ్య తెలిపారు. నిందితుల నుంచి 2.58 ఎండిఎంఏ డ్రగ్స్, 38.56 గ్రాముల ఓ జి కుష్ ను స్వాధీనం చేసుకున్నారు. ఒక బైకును, మూడు సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరులో వీరు చేస్తున్న వ్యాపారాలపై నిఘా పెట్టి మిగిలిన వారిని కూడా అరెస్ట్ చేస్తామని ఎస్టిఎఫ్ టీం లీడర్ ప్రదీప్ రావు తెలిపారు.

Tags:

Advertisement

Latest News

తిరుమలలో నమాజ్ కలకలం... తిరుమలలో నమాజ్ కలకలం...
భక్తుల రద్దీ.. హనుమాన్ జయంతి వేడుకల్లో కిక్కిరిసి పోయిన తిరుమలలో ఒక్కసారిగా కలకలం రేగింది. హనుమజ్జయంతి వేడుకలు సాగుతున్న పరిస్థితుల్లో దిగ్బ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. ముస్లిం...
పునాధులతో సహా తొలగించిన హైడ్రా
మిస్ వరల్డ్ ఫైనల్ లిస్ట్ లో 24మంది
కవిత లేఖ.. బిఆర్ఎస్ లో లుకలుక
ఇటుకబట్టీల్లో చైల్డ్ లేబర్.. అధికారుల సీరియస్
సీఎం ఓఎస్డి అంటూ మాజీ క్రికెటర్ బెదిరింపులు.. అరెస్ట్
బక్రీద్ పండుగ సందర్భంగా పోలీసుల సమన్వయ సమావేశం