రోడ్డుప్రమాదంలో మరణించిన హోంగార్డ్ కుటుంబానికి చెక్కు అందజేత

By Ravi
On
రోడ్డుప్రమాదంలో మరణించిన హోంగార్డ్ కుటుంబానికి చెక్కు అందజేత

విధినిర్వహణలో రోడ్డుప్రమాదంలో మరణించిన హోం గార్డు అధికారికి  రూ.6.28 లక్షల చెక్కును సైబరాబాద్ జాయింట్ సీపీ ట్రాఫిక్ డా. గజరావ్ భూపాల్ అందజేశారు. మియాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న హోం గార్డు అధికారి ఎన్. సింహాచలం కుటుంబానికి రూ.6,28,000 చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో మెడ్చల్ ట్రాఫిక్ డీసీపీ గుణశేఖర్, మియాపూర్ ట్రాఫిక్ ఏసీపీ వెంకటయ్య, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ ప్రసాంత్ హాజరయ్యారు. హోం గార్డు అధికారి ఎన్. సింహాచలం (వయసు 43), శ్రీకాకుళం జిల్లా వాసి అని, 2007 నుండి పనిచేస్తున్నట్లు తెలిపారు. 07.04.2025న విధుల్లో ఉన్న సమయంలో మియాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన దుర్మరణం చెందారని ఆయన భార్య, ఇద్దరు పిల్లలు మరియు వృద్ధ తల్లిదండ్రులతో కూడిన కుటుంబాన్ని ఆదుకునేందుకు, సైబరాబాద్ పోలీస్ విభాగాల—ట్రాఫిక్, లా & ఆర్డర్ తదితర శాఖల—సిబ్బంది తమ వంతుగా స్వచ్ఛందంగా విరాళాలు ఇచ్చారు. ఇది ఒక మానవీయ చైతన్యానికి నిదర్శనం అధికారులు అభినందించారు.

Tags:

Advertisement

Latest News