కారు బీభత్సం.. బాలుడు మృతి.. బాలికకు గాయాలు

By Ravi
On
కారు బీభత్సం.. బాలుడు మృతి.. బాలికకు గాయాలు

సంగారెడ్డి జిల్లాలోని అమీన్‌పూర్ మండలం నర్రెగూడెం మైదానంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. రోడ్డుప్రమాదంలో ఓ బాలుడు మృతి చెందగా, మరో బాలిక తీవ్రంగా గాయపడింది. మనివర్మ (10) ఏకవాణి (12) అనే ఇద్దరు చిన్నారులు మైదానంలో ఆడుకుంటున్నారు. అదే సమయంలో, గ్రౌండ్ లోకి కారు నడుపుకుంటూ వచ్చిన మహిళ వారిని ఢీకొటింది.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మనివర్మను హుటాహుటిన పనాసియా ఆసుపత్రికి తరలించగా, వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. ఏకవాణికి తీవ్ర గాయాలు కావడంతో ఆమెను హరణ్య ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
మృతి చెందిన మనివర్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్‌చెరులోని మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై అమీన్‌పూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. IMG-20250519-WA0038

Tags:

Advertisement

Latest News