తెలంగాణలో మందుబాబులకు ఊహించని షాక్
By Ravi
On
తెలంగాణ రాష్ట్రంలో మందు బాబులకు ఊహించని షాక్ తగిలింది. ఇప్పటికే ధరల మోతతో ఇబ్బంది పడుతున్న మందుబాబులు, తాజాగా మరో మారు లిక్కర్ ధరలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో వడదెబ్బ కొట్టినంత పనైంది. ఇటీవల బీర్ల ధరలను పెంచిన రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు ఇతర మద్యం ధరలను కూడా పెంచడానికి సిద్ధమైంది. మార్కెట్ ధరల ఆధారంగా కొత్త రేట్లు అమలులోకి రానున్నాయి. ఎక్సైజ్ శాఖ వైన్స్ కి పంపిన సర్క్యులర్ ప్రకారం180 మిల్లీ లీటర్లకు.. క్వార్టర్ బాటిల్ పైన పది రూపాయలు, హాఫ్ బాటిల్ పైన 20 రూపాయలు, ఫుల్ బాటిల్ పైన 40 రూపాయలు లిక్కర్ ధరలు పెంచింది. అయితే మద్యం దుకాణాలకు జారీ చేసిన సర్కులర్ లో ఈ విషయాన్ని ఎక్సైజ్ శాఖ స్పష్టంగా పేర్కొన్నారు. ఇప్పటికే ఈ సంవత్సరం ఫిబ్రవరి మాసంలో బీరు ధరలను 15 శాతం పెంచింది ప్రభుత్వం. తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
Tags:
Latest News
18 May 2025 18:36:31
తెలంగాణ రాష్ట్రంలో మందు బాబులకు ఊహించని షాక్ తగిలింది. ఇప్పటికే ధరల మోతతో ఇబ్బంది పడుతున్న మందుబాబులు, తాజాగా మరో మారు లిక్కర్ ధరలు పెంచాలని ప్రభుత్వం...