హైదరాబాద్ లో పేలుళ్లకు ప్లాన్.. భగ్నం చేసిన పోలీసులు

By Ravi
On
హైదరాబాద్ లో పేలుళ్లకు ప్లాన్.. భగ్నం చేసిన పోలీసులు

పహెల్గావ్ ఘటన నుండి ఇంకా జనం తేరుకొని లేదు. ఇంతలో అలజడి రేకెత్తించే సమాచారం పోలీస్ శాఖకు అందింది. హైదరాబాద్ లో పేలుళ్లకు ప్లాన్ వేశారు ముష్కర ముక్కలు. విషయం తెలియగానే అప్రమత్తమైన తెలంగాణ ఇంటెలిజెన్స్.. ఏపీ, తెలంగాణ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు.  హైదరాబాద్ లో పేలుళ్లకు ప్లాన్ చేసిన వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.  విజయనగరానికి చెందిన సిరాజ్, హైదరాబాద్ కు చెందిన సమీర్ ఇద్దరు కలిసి ఓ మాస్టర్ ప్లాన్ వేశారు. హైదరాబాద్ లో రద్దీగా ఉండే ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించి వరుస పేలుళ్లకు పాల్పడాలని భావించారు. విషయం పసిగట్టిన పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. విజయనగరంలో పేలుడు పదార్థాలు కొనుగోలు చేసిన సిరాజ్, సమీర్ తో కలిసి డమ్మీ బ్లాస్ట్ కు ప్లాన్ చేశారు.  దాని ద్వారా జనాలను భయబ్రాంతులకు గురి చేయాలని అనుకున్నారు. ఈ పేలుళ్లకు  సౌదీ అరేబియా నుంచి సిరాజ్, సమీర్ కు  ఐసిస్ మాడ్యుల్ ఆదేశాలు ఇచ్చినట్లు విచారణలో తేలింది. పేలుడు పదార్థాల కొనుగోలు కోసం ఆర్ధికంగా సహకరించినట్లు తెలుస్తోంది.  తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ తో పాటు ఏపీ ఇంటెలిజెన్స్ జాయింట్ ఆపరేషన్ మొత్తానికి ఈ ఇద్దరిని అరెస్ట్ చేసి వారి ప్లాన్ తలకిందులు చేశారు. వీరికి సహకరించిన వారి కోసం వేట మొదలు పెట్టారు.

Tags:

Advertisement

Latest News

తెలంగాణలో మందుబాబులకు ఊహించని షాక్ తెలంగాణలో మందుబాబులకు ఊహించని షాక్
తెలంగాణ రాష్ట్రంలో మందు బాబులకు ఊహించని షాక్ తగిలింది. ఇప్పటికే ధరల మోతతో ఇబ్బంది పడుతున్న మందుబాబులు, తాజాగా మరో మారు లిక్కర్ ధరలు పెంచాలని ప్రభుత్వం...
హైదరాబాద్ లో పేలుళ్లకు ప్లాన్.. భగ్నం చేసిన పోలీసులు
కలర్ ఫుల్ గా మారిన కమాండ్ కంట్రోల్ సెంటర్
హైదరాబాద్ లో మరో ప్రమాదం.. రెస్క్యూ ఆపరేషన్..50మంది సేఫ్
చర్లపల్లిలో ట్యాంకర్ లో చెలరేగిన మంటలు
103వ రోజుకి చేరుకున్న డంపింగ్ యార్డ్ వ్యతిరేఖ నిరాహారదీక్ష
తెలంగాణలో పలుచోట్ల ఎక్సైజ్ అధికారుల దాడులు.. బెల్లం ఆలం పటిక స్వాధీనం