హైదరాబాద్ లో మరో ప్రమాదం.. రెస్క్యూ ఆపరేషన్..50మంది సేఫ్
By Ravi
On
పాతబస్తీలో ఘటన జరిగి గంటలు కూడ గడవలేదు. మైలార్ దేవులపల్లి ప్రాంతంలో మరో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఉడంగడ్డ ప్రాంతంలో ఓ మూడంతస్తుల భవనాన్ని మంటలు చుట్టుముట్టాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది క్షణాల్లో అక్కడికి చేరుకున్నారు. భవనంలో 50మందికి పైగా చిక్కుకున్నారని తెలియడంతో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. 50మందికి ఎలాంటి గాయాలు కాకుండా వారందరిని సురక్షితంగా బయటకు తీసుకు వచ్చారు. అగ్నిమాపక సిబ్బందిని జనం అభినందించారు. మంటల్లో చిక్కుకున్న వారిలో 16మంది చిన్నారులు వున్నారు. షాట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
Tags:
Latest News
18 May 2025 18:36:31
తెలంగాణ రాష్ట్రంలో మందు బాబులకు ఊహించని షాక్ తగిలింది. ఇప్పటికే ధరల మోతతో ఇబ్బంది పడుతున్న మందుబాబులు, తాజాగా మరో మారు లిక్కర్ ధరలు పెంచాలని ప్రభుత్వం...