సీఎం రేవంత్ రెడ్డి హయాంలో తెలంగాణ అభివృద్ధి సాధిస్తోంది

By Ravi
On
సీఎం రేవంత్ రెడ్డి హయాంలో తెలంగాణ అభివృద్ధి సాధిస్తోంది

తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రుల ఆధ్వర్యంలో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతొందని డీసీసీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు, చైర్మన్ చల్లా నర్సింహరెడ్డి అన్నారు.కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రతి ఒక్క కార్యక్రమం,పథకం ప్రజలకు చేరేలా ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని, కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యతగా ముందుకు సాగాలని అన్నారు.  శేరిలింగంపల్లి నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రతి ఒక్క కార్యకర్తకి అండగా నిలుస్తామని, పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు. మదీనాగూడ కిన్నెర గ్రాండ్ హోటల్ నందు టీపీసీసీ ఆదేశాల మేరకు డీసీసీ అధ్యక్షుడు  చల్లా నర్సింహారెడ్డి , స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనరెడ్డి  నేతృత్వంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, ఉప్పలపాటి శ్రీకాంత్,  మాజీ కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,డివిజన్ అధ్యక్షులు,మహిళా కాంగ్రెస్ నాయకులు,యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Advertisement

Latest News

రోడ్డుప్రమాదంలో హార్డ్ వేర్ పార్క్ ఉద్యోగి మృతి రోడ్డుప్రమాదంలో హార్డ్ వేర్ పార్క్ ఉద్యోగి మృతి
రంగారెడ్డి జిల్లా రాచకొండ కమిషనరేట్ బాలాపూర్  పోలీస్ స్టేషన్ పరిధిలో RCI రోడ్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. ముందుగా వెళుతున్న గ్రానైట్ ట్రాక్టర్ ని బైక్...
రియల్ ఎస్టేట్ వ్యాపారులకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ వార్నింగ్
ఎదులబాద్ గ్రామపంచాయతీ అవకతవకల్లో బిల్ కలెక్టర్ అరెస్ట్
కమిషనర్ ఆనంద్ ను అభినందించిన డీజీపీ జితేందర్
పోలీస్ శాఖ ప్రతిష్ట పెరిగేలా పని చేయాలి. డీజీపీ జితేందర్
డెలివరీ బాయ్ పై బ్లేడ్లతో దాడి చేసి దోపిడీ
సీఎం రేవంత్ రెడ్డి హయాంలో తెలంగాణ అభివృద్ధి సాధిస్తోంది