మార్కెట్ లో నకిలీ ఔషధాల విక్రయాలపై దాడులు పెంచండి..డిసిఏ డైరెక్టర్

By Ravi
On
మార్కెట్ లో నకిలీ ఔషధాల విక్రయాలపై దాడులు పెంచండి..డిసిఏ డైరెక్టర్

తెలంగాణా ఔషధ నియంత్రణ శాఖ (డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్) డైరెక్టర్ జనరల్ షానవాజ్ ఖాసీం ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న  అధికారులతో పాటు ఔషధ తనిఖీ అధికారులు, అసిస్టెంట్ డైరెక్టర్లు మరియు డిప్యూటీ డైరెక్టర్లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో డైరెక్టర్ జనరల్ ongoing enforcement కార్యకలాపాలను సమీక్షించి, మార్కెట్‌లో నకిలీ ఔషధాల వ్యాప్తిని అరికట్టేందుకు అధికారులు దాడులు పెంచాలని, నిరంతర నిఘా పెట్టాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. నకిలీ ఔషధాల తయారీ, పంపిణీ, అమ్మకాలలో నిమగ్నమైన నెట్‌వర్క్‌లను నిర్మూలించడానికి అధికారులకు స్పష్టమైన సూచనలు ఇచ్చారు. రెగ్యులర్‌గా నేరపూరిత కార్యకలాపాల్లో పాల్గొంటున్న వ్యక్తులపై ఔషధ తనిఖీ అధికారులు నిఘా పెంచాలని, అవసరమైతే పోలీస్‌ సాయం తీసుకుని enforcement చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఔషధాల దుర్వినియోగాన్ని అరికట్టడం తెలంగాణా ఔషధ నియంత్రణ శాఖకు అత్యంత ప్రాముఖ్యత కలిగిన విషయం అని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఔషధాల విక్రయాలు మరియు దుర్వినియోగాన్ని అరికట్టేందుకు అధికారులు సమిష్టిగా కృషి చేయాలని సూచించారు.  తెలంగాణ ముఖ్యమంత్రి  "డ్రగ్-ఫ్రీ తెలంగాణా" లక్ష్యాన్ని నిజం చేసేందుకు, మత్తు పదార్థాల (నార్కోటిక్ డ్రగ్స్ మరియు సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్) దుర్వినియోగాన్ని అరికట్టేందుకు మద్యపాన నిషేధ శాఖతో సమన్వయంగా కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఔషధ తనిఖీ అధికారులు విక్రయ కేంద్రాల్లో తనిఖీలు నిర్వహిస్తూ, తప్పనిసరిగా QR కోడ్‌లు ధృవీకరించడం, నకిలీ ఔషధాలను గుర్తించేందుకు నిఘా వ్యవస్థను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. దీని ద్వారా ప్రజారోగ్యాన్ని కాపాడటం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అలాగే ప్రజలను తప్పుదారి పట్టించే, అనధికారిక ప్రకటనలు చేసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఔషధాలకు సంబంధించిన అక్రమ కార్యకలాపాలపై ప్రజలు ఫిర్యాదులు ఇవ్వాలనుకుంటే, తెలంగాణా ఔషధ నియంత్రణ శాఖ టోల్-ఫ్రీ నెంబర్ 1800-599-6969 ద్వారా నివేదించవచ్చు. ఈ నెంబర్ ప్రతి పని దినాల్లో ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు అందుబాటులో ఉంటుందని చెప్పారు.

Tags:

Advertisement

Latest News

రోడ్డుప్రమాదంలో హార్డ్ వేర్ పార్క్ ఉద్యోగి మృతి రోడ్డుప్రమాదంలో హార్డ్ వేర్ పార్క్ ఉద్యోగి మృతి
రంగారెడ్డి జిల్లా రాచకొండ కమిషనరేట్ బాలాపూర్  పోలీస్ స్టేషన్ పరిధిలో RCI రోడ్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. ముందుగా వెళుతున్న గ్రానైట్ ట్రాక్టర్ ని బైక్...
రియల్ ఎస్టేట్ వ్యాపారులకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ వార్నింగ్
ఎదులబాద్ గ్రామపంచాయతీ అవకతవకల్లో బిల్ కలెక్టర్ అరెస్ట్
కమిషనర్ ఆనంద్ ను అభినందించిన డీజీపీ జితేందర్
పోలీస్ శాఖ ప్రతిష్ట పెరిగేలా పని చేయాలి. డీజీపీ జితేందర్
డెలివరీ బాయ్ పై బ్లేడ్లతో దాడి చేసి దోపిడీ
సీఎం రేవంత్ రెడ్డి హయాంలో తెలంగాణ అభివృద్ధి సాధిస్తోంది