చిన్నారికి కేక్ ఇచ్చి.. ఫోన్ తో ఉడాయించిన దుండగులు
By Ravi
On
నగర శివారులో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. కారులో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు ఆడుకుంటున్న మూడేళ్ల పాపకు కేకు ఇచ్చి, అనంతరం చిన్నారి చేతిలోని ఫోన్‌ను లాక్కెళ్లారు. ఈ సంఘటన సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పటాన్ చెరువు రుద్రారం ముంబై జాతీయ రహదారిపై శ్రీకాంత్ అనే వ్యక్తి తాటి ముంజలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. కారులో వచ్చిన వ్యక్తులు శ్రీకాంత్ కూతురి వద్ద ఆగారు. వారిలో ఒకరు పాపకు కేకు ఇచ్చి, ఫోన్ తో ఆడుకుంటున్న సమయంలో ఆమె చేతిలోని ఫోన్‌ను లాక్కుని కారులో వేగంగా వెళ్లిపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సిసి ఫుటేజ్ సేకరించిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Tags:
Latest News
17 May 2025 22:24:09
రంగారెడ్డి జిల్లా రాచకొండ కమిషనరేట్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో RCI రోడ్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. ముందుగా వెళుతున్న గ్రానైట్ ట్రాక్టర్ ని బైక్...