10 కేజీల గంజాయి స్వాదీనం.. ఇద్దరి అరెస్టు

By Ravi
On
10 కేజీల గంజాయి స్వాదీనం.. ఇద్దరి అరెస్టు

కర్ణాటకకు చెందిన వ్యక్తి వద్ద తక్కువ ధరలకు కొనుగోలు చేసిన గంజాయిని కారులో తీసుకు వస్తే అనుమానం వస్తుందని బైక్‌పై గుంతకల్‌ నుంచి హైదరాబాద్‌కు గంజాయిని అమ్మకానికి తీసుక వచ్చిన ఇద్దరిని మేడ్చల్‌ ఎన్‌ఫొ ర్స్‌మెంట్ ఎక్సైజ్‌ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి రూ. 5లక్షల విలువ చేసే 10కేజీల గంజాయిని, రూ. 1.20 లక్షల విలువ చేసే బైక్‌,  సెల్‌ ఫోన్లు  స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటకకు చెందిన రాము అనే వ్యక్తి నుంచి అనంతపురం గుంతకల్‌  ప్రాంతానికి చెందిన చాకలి వంశీ, నేమకల్‌ వాల్మీకి వేణుగోపాల్‌ అనే  ఇద్దరు యువకులు 10 కేజీల గంజాయిని బైక్‌పై తీసుకవచ్చి సుచిత్ర కొంపల్లి చౌరస్తాలో గంజాయిని అమ్మాలని చుండగా  అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరిండెంట్‌ మాధావయ్య, సీఐ నర్సిరెడ్డి, ఎస్సై పవన్‌కుమార్‌రెడ్డి సిబ్బంది కలిసి పట్టుకున్నారు. నిందితులను, గంజాయిని కుత్భుల్లాపూర్‌ ఎక్సైజ్‌ స్టేషన్‌లో అప్పగించారు.

Tags:

Advertisement

Latest News