రుద్రారం బాలాజీ డెవలపర్స్ పై చర్యలేవీ?

By Ravi
On
రుద్రారం బాలాజీ డెవలపర్స్ పై చర్యలేవీ?

ఒక సామాన్య పౌరుడు చిన్న పొరపాటు చేస్తే చాలు, హడావిడి చేసే అధికారులు, పెద్ద పెద్ద డెవలపర్లు నిబంధనలు తుంగలో తొక్కితే మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. IMG-20250517-WA0061తాజాగా పటన్ చెరు రుద్రారం గ్రామంలో జరిగిన సంఘటన ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది.
బాలాజీ డెవలపర్స్ అనే సంస్థ ఒక పెద్ద చెరువు నుండి యథేచ్ఛగా నీటిని వాడుకుంటున్నట్లు కథనాలు వచ్చాయి. ఇది చుట్టుపక్కల గ్రామాల ప్రజల వ్యవసాయ అవసరాలకు తీవ్ర విఘాతం కలిగిస్తోంది. అయినా సంబంధిత అధికారులు మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
చిన్నపాటి నిర్మాణాల విషయంలో సైతం నిబంధనలు అతిక్రమిస్తే వెంటనే స్పందించే అధికారులు, ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్న నీటి అక్రమ వినియోగాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదు? అధికారుల అలసత్వానికి కారణం ఏమిటి? రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయా? అనే ప్రశ్నలు సామాన్య ప్రజలను రేకెత్తుతున్నాయి.
ప్రభుత్వం, సంబంధిత శాఖలు ఈ విషయంపై తక్షణమే స్పందించి సమగ్ర విచారణ జరిపించాలి. చెరువులోని నీటిని అక్రమంగా వాడుకుంటున్న బాలాజీ డెవలపర్స్ పై కఠిన చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని ప్రజలు మండిపడ్డారు.
అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించి, చట్టం ముందు అందరూ సమానమే అని నిరూపించాలి. లేకపోతే, సామాన్యుడికి ఒక న్యాయం, బడాబాబులకు మరొక న్యాయం అనే భావన ప్రజల్లో మరింత బలపడుతుంది. ఇది వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది.

Tags:

Advertisement

Latest News

సీఎం రేవంత్ రెడ్డి హయాంలో తెలంగాణ అభివృద్ధి సాధిస్తోంది సీఎం రేవంత్ రెడ్డి హయాంలో తెలంగాణ అభివృద్ధి సాధిస్తోంది
తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రుల ఆధ్వర్యంలో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతొందని డీసీసీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు, చైర్మన్ చల్లా నర్సింహరెడ్డి...
మార్కెట్ లో నకిలీ ఔషధాల విక్రయాలపై దాడులు పెంచండి..డిసిఏ డైరెక్టర్
10 కేజీల గంజాయి స్వాదీనం.. ఇద్దరి అరెస్టు
చిన్నారికి కేక్ ఇచ్చి.. ఫోన్ తో ఉడాయించిన దుండగులు
రుద్రారం బాలాజీ డెవలపర్స్ పై చర్యలేవీ?
ఇజ్రయెల్ జెండా పీకేసి రీల్ చేసిన యువకుడు.. కేసు నమోదు
వివాదాస్పద భూమిలో సర్వే చేస్తున్న రెవెన్యూ అధికారులు