బంగ్లాదేశ్ యువతులతో వ్యభిచారం.. ముఠా అరెస్ట్

By Ravi
On
బంగ్లాదేశ్ యువతులతో వ్యభిచారం.. ముఠా అరెస్ట్

సికింద్రాబాద్ లో నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు. ముగ్గురు యువకులను, ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకొని గోపాలపురం పోలీసులకు అప్పగించారు. రెజిమెంటల్ బజార్ లో బంగ్లా దేశ్ కి చెందిన యువతితో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో దాడులు నిర్వహించి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరు నిర్వాహకులు, ఒక విటుడు, ఇద్దరు యువతులను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. ఇందులో ఒక యువతి బంగ్లా దేశ్ కు మరో యువతి వెస్ట్ బెంగాల్ కు చెందిన వారు కాగా మరో యువకుడు కూడా బంగ్లా దేశ్ కు చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు పేర్కొన్నారు. బంగ్లాదేశ్ నుండి వీరిద్దరూ అక్రమంగా వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ముఠా సభ్యులను గాంధీ హాస్పిటల్ లో వైద్య పరీక్షలు నిర్వహించి న్యాయ స్థానానికి తరలించారు..

Tags:

Advertisement

Latest News

సామాన్యుల ఇండ్లు నేలమట్టం.. బడాబాబుల ఇండ్లకు అధికారుల దాసోహం సామాన్యుల ఇండ్లు నేలమట్టం.. బడాబాబుల ఇండ్లకు అధికారుల దాసోహం
అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శెట్టికుంటలో గురువారం మున్సిపల్ అధికారులు చేపట్టిన కూల్చివేతలు తీవ్ర విమర్శలకు దారి తీసింది. శెట్టికుంటలో అడ్డగోలు అక్రమ నిర్మాణాలు ఉన్న కేవలం సామాన్యులపై...
భర్తతో గొడవపడి ముగ్గురు పిల్లలతో చెరువులోకి దూకిన తల్లి
తాను ప్రేమించిన అమ్మాయి దక్కలేదని..
వైభవంగా మొదలైన సరస్వతి పుష్కరాలు..
హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కి నోటీసులు ఇచ్చిన పోలీసులు
గాలిజనార్ధన్ రెడ్డికి సీబీఐ కోర్టులో ఎదురుదెబ్బ
బార్ల దరఖాస్తులు ఇలా అప్లై చేసుకోండి