తెలంగాణలో 28(2బి) బార్ల దరఖాస్తులకు ఆహ్వానం
తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ 28 (2బి) బార్లకు దరఖాస్తులకు ఆహ్వానానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. జూన్ 6వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 24 బార్లకు, మహబూబ్‌నగర్, బోధన్, నిజామాబాద్, సరూర్‌నగర్ జల్‌పల్లి మునిసిపాలిటీలో ఒక్కొక్క బార్‌కు దరఖాస్తులను ఆహ్వానించింది. గతంలో 2బి బార్లకు పిలిచిన దరఖాస్తులతో బార్ లైసెన్స్ పొంది ఫీజ్ లు చెల్లించక పోవడం, ఇతర కారణాలతో రద్దు చేయబడిన 16 బార్లకు, 2బి బార్ల లైసన్స్‌లకు 90 రోజుల్లో అవసరమైన డాక్యుమెంటేషన్, ఫీజులు చెల్లించకుండా బార్ల నిర్వహణకు ముందుకు రాని 12 బార్లను తిరిగి పునరుద్దారణ కోసం ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ మరోసారి దరఖాస్తులను ఆహ్వానించింది. ప్రతి దరఖాస్తు ఫారం రుసుం రూ. లక్షగా ఖరారు చేశారు. దరఖాస్తులతోపాటు రూ.లక్షను డి.డి. చెల్లించాల్సి ఉంటుందని, డి.డి.రూపంలో చెల్లించిన డబ్బు నాన్ రిఫండబుల్ గా ( తిరిగి చెల్లించడం లేకుండా ) ఎక్సైజ్‌శాఖ నిర్థేశించింది. 2బి బార్లకు పిలిచిన దరఖాస్తుల ఆహ్వానంలో 28 బార్లకు ఒక్కొక్కరు ఎన్ని దరఖాస్తులైన చేసుకోవచ్చునని, జీహెచ్‌ఎంసీ తోపాటు ఇతర మునిసి పాలిటీల్లోని 2బి బార్లకు ఎవ్వరైనా దరఖాస్తులు చేసుకోవచ్చునని పెర్కోన్నారు.
డి.డి.లతో పాటు దరఖాస్తులను ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయం, హైదరాబాద్, రంగారెడ్డి డిప్యూటి కమిషనర్ కార్యాలయాల్లోను మిగిలిన అయా ప్రాంతాల్లో దరఖాస్తులను అందించాల్సి ఉంటుందని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. Tgbcl. Telangana gov. in సైట్ ద్వారా దరఖాస్తుల నమూనా, నియమ నిబంధనలు ఉంటాయి. 2బి బార్లకు దరఖాస్తులను ఈ నెల 15 నుంచి జూన్ 6 తేదీ వరకు స్వీకరించబడుతాయని ఎక్సైజ్ అధికారులు పెర్కోన్నారు.