పలుచోట్ల ఎక్సైజ్ దాడి.. గంజాయి.. బెల్లంఆలం స్వాధీనం
ఎస్ టి ఎఫ్, డి టి ఎఫ్ టీమ్‌లు కలిసి రెండు కేసుల్లో 12.230 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ రూ. 6.50 లక్షలుగా ఉంటుందని అంచనా వేశారు. మల్కాజ్గిరి ఎక్సైజ్ సూపరిండెంట్ పరిధిలోని చర్లపల్లి, రాంపల్లి ప్రాంతాల్లో డిటిఎఫ్ సీఐ భరత్ భూషన్ టీమ్‌తో కలిసి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మధ్య ప్రదేశ్ కు చెందిన హరి కుశ్వాహ వద్ద 4 కేజీలు, ఒరిస్సాకు చెందిన భైనాథ్ బిశ్వాల్ వద్ద 6 కేజీలు మొత్తంగా 10 కేజీల గంజాయిని పట్టుకున్నట్లు సీఐ తెలిపారు. గంజాయిని, నిందితులను ఘట్కేసర్ ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించినట్లు తెలిపారు.
మరో కేసులో 2.230 కేజీలు..
నాంధేడ్ నుంచి ఒక డీసీఎం వ్యాన్‌లో గంజాయి వస్తుందనే సమాచారం మేరకు ఎస్టి ఎఫ్ బి ఎస్సై బాలరాజు సిబ్బంది కలిసి హైదారాబాద్ శివారులో దాడి చేసి డీసీఎం వ్యాస్‌ను పట్టుకున్నారు. వ్యాన్‌లో తనిఖీలు నిర్వ హించగా 2.230 కేజీల గంజాయి లభించినట్లు ఎస్సై బాలరాజు తెలిపారు. డీసీఎం వ్యాన్ డ్రైవర్ పైసల్ ను అరెస్టు చేసి, డీసీఎం వ్యాన్‌ను సీజ్ చేశారు. ఈ రెండు కేసుల్లో గంజాయిని పట్టుకున్న డీటీఎప్, ఎస్టి ఎఫ్టీమ్లను ఎక్సైజ్
ఎన్‌ఫొర్స్‌మెంట్ డైరెక్టర్ షానవాజ్ ఖాసీం, మల్కాజ్గిరి ఎక్సైజ్ సూపరింటెండెంట్ , ఎస్టి ఎఫ్బి టీమ్ లీడర్ నవీన్,ప్రదీప్‌రావు అభినందించారు.
భారీగా బెల్లం పట్టివేత..
హైదరాబాద్ నుంచి నాగర్ కర్నూల్ ఎండబెట్ల గ్రామానికి నల్లబెల్లం తరలి వెలుతుందనే సమాచారం మేరకు ఎస్ టి ఎఫ్ బీ టీమ్ ఎస్సై బాలరాజు సిబ్బంది కలిసి మాటు వేసి బెల్లంఆలం పట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి హోమినీ వ్యాన్‌లో బెల్లం తరలివెలుతుందని ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.
ఈ తనిఖీల్లో హోమిని వ్యాన్ని పరిశీలించిగా అందులో 432 కేజీల బెల్లం, 10 కేజీల ఆలం ( పటిక) ఉన్నట్లు గుర్తించారు. డ్రైవర్ శివకుమార్‌ను అరెస్టు చేశారు. బెల్లాన్ని పట్టుకున్న టీమ్‌లో ఎస్సై బాలరాజుతోపాటు సాయి కిరణ్, కౌశిక్, నితిన్, హనీప్, శంకర్, సంతోష్, సాయికృష్ణలు ఉన్నారు.