చిట్యాల మండలంలో బెల్ట్ షాప్స్ కి వ్యతిరేకంగా మహిళల ఆందోళన
By Ravi
On
నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో బెల్ట్ షాప్స్ మూసివేయాలని మహిళలు ఆందోళన చేపట్టారు. బెల్ట్ షాప్ వల్ల చిన్న చిన్న పిల్లలు మద్యానికి బానిసై భవిష్యత్తు పాడు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో ఎక్కువ మంది యువకులు మద్యం, గంజాయికి బానిసలు అయ్యారని దాని వల్ల కుటుంబాలు ఆర్థికంగా చిన్నాభిన్నం అయి రోడ్డున పడే పరిస్థితి నెలకొందని తెలిపారు. మే 5లోగా పెద్దకాపర్తి గ్రామంలో బెల్ట్ షాప్స్ పూర్తిగా మూసి వేయాలని, లేకపోతే దాడులకు పాల్పడుతామని షాప్స్ యజమానులకు హెచ్చరిక చేశారు. ఈ విషయంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
Tags:
Latest News
28 Apr 2025 17:39:37
తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబును సోమవారం నాడు ఆయన కార్యాలయంలో కలిసి సమావేశం నిర్వహించారు....