పోయిన మీ ఫోన్ ఇందులో ఉందా.. చెక్ చేసుకోండి

By Ravi
On
పోయిన మీ ఫోన్ ఇందులో ఉందా.. చెక్ చేసుకోండి

మీ ఫోన్ పోయిందా.. లేదా దొంగతనానికి  గురైందా.. మరి ఎలా అది దొరికేది అని ఆలోచిస్తున్నారా.. సైబరాబాద్ పోలీసులు ఒకటి కాదు రెండు కాదు మిస్ అయిన 310 ఫోన్లు వాటి యజమానులకు అందించారు. అదెలా అనుకుంటున్నారా  ఫోన్ థెఫ్ట్ అయినా, మిస్ అయినా వెంటనే CEIR పోర్టల్ లో నమోదు చేసుకోవాలి అలా చేసుకున్న లేక పోలీసులకు ఫిర్యాదు చేసిన వారు ceir లో నమోదు చేస్తారు.. ఆ తరువాత మీ ఫోన్ ఎక్కడ ఉన్నా వెంటనే పసిగట్టి రికవరీ చేస్తారు. అలా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటివరకు 5400 ఫోన్లు రికవరీ చేసినట్లు క్రైమ్ డీసీపీ ఎల్.సి. నాయక్ తెలిపారు. ఏడవ విడతలో భాగంగా మరో 310 ఫోన్లు రికవరీ చేసి వాటి యజమానులకు అందించారు. CEIR పోర్టల్ 2023 నుండి అందుబాటులోకీ వచ్చిందని,  దీని ద్వారా ఫోన్లు పోగొట్టుకున్న బాధితులకు ఫోన్లు రికవరీ చేసి ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఫోన్ పోయిన వెంటనే స్థానిక పీఎస్ లో IMEI నెంబర్ బ్లాక్ చేయించాలని అలా చేసిన తరువాత ఖచ్చితంగా రికవరీ అవుతుందని డీసీపీ తెలిపారు. ఫోన్ పోయిన వెంటనే స్థానిక పిఎస్ లో ఫిర్యాదు చేయాలని కంప్లైంట్ విషయంలో అశ్రద్ధ చేస్తే మీ రికవరీ కష్టం అని ఆయన వివరించారు. ఫోన్ రికవరీ చేసిన సిబ్బందిని డీసీపీ అభినందించారు.

Tags:

Advertisement

Latest News

గాంధీలో ఘనంగా నర్సుల దినోత్సవం గాంధీలో ఘనంగా నర్సుల దినోత్సవం
అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా గాంధీలో ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతి నిర్వహించారు. ఆమె చిత్రపటం వద్ద కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. గాంధీలో నిత్యం నర్సులు విశేష సేవలు...
మహేంద్రహిల్స్ లో ఘనంగా బుద్ధపూర్ణిమ వేడుకలు
బడంగిపేటలో క్యాండిల్ ర్యాలీ.. పాల్గొన్న కాంగ్రెస్ నేతలు
హత్య కేసును ఛేదించిన పోలీసులు.. అయిదుగురు అరెస్ట్
జార్ఖండ్ యువతిపై గ్యాంగ్ రేప్.. ఇద్దరి అరెస్ట్
నకిలీ ఔషధాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. Dca
ఘనంగా కట్టమైసమ్మ జాతర.. భారీగా హాజరైన భక్తులు