గ్రూప్ 1 అభ్యర్థులకు జరిమానా విధించిన హైకోర్టు
గ్రూప్1 పిటీషనర్లకు హైకోర్టు జరిమానా విధించింది.
తప్పుడు ప్రమాణపత్రాలతో తప్పుదోవ పట్టించారన్న జస్టిస్ నగేష్ భీమపాక, పిటీషనర్లకు 20వేల జరిమానా విధించి తప్పుడు అఫిడవిట్లు దాఖలు చేసిన పిటీషనర్లపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. మెయిన్స్ మూల్యాంకణంలో అవకతవకలు జరిగాయంటూ 19మంది అభ్యర్థులు పిటీషన్ దాఖలు చేశారు. పిటీషన్లపై జస్టిస్ నగేష్ భీమపాక విచారణ చేపట్టారు. టీజీపీఎస్సీ జారీ చేసిన మార్కుల మెమోకు, వెబ్సైట్లో ఉన్న మార్కులకు తేడాలున్నాయన్న పిటీషనర్లు
రీవాల్యుయేషన్ చేపట్టి మార్కులను టీజీపీఎస్సీ పారదర్శకంగా వెల్లడించాలని పిటీషనర్లు కోరారు. అభ్యర్థులు తప్పుడు ప్రమాణపత్రం దాఖలు చేశారన్న టీజీపీఎస్సీ న్యాయవాది వాదనలు విన్న హైకోర్టు ప్రాథమిక వివరాలను పరిశీలిస్తే అభ్యర్థులు తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారని అభిప్రాయ పడింది.వాస్తవాలను దాచి కోర్టును తప్పుదోవ పట్టించారన్న హైకోర్టు పిటీషనర్లపై చర్యలు తీసుకోవాలని జ్యూడిషియల్ రిజిస్ట్రార్‌ను ఆదేశాలు జారీ చేసింది.