జోరుగా మందు.. విందు.. ఇంతలో..

By Ravi
On
జోరుగా మందు.. విందు.. ఇంతలో..

లక్షలు ఖర్చుపెట్టి పెద్ద పెద్ద ఫంక్షన్ లు చేస్తారు. వచ్చిన అతిథులకు తమ దర్పం చూపించుకోవడానికి మద్యం మాంసం బిర్యాని పెడతారు. కానీ తెలంగాణ మద్యం వాడకుండా కొద్దిపాటి తక్కువ ధరలకు లభించే నాన్ డ్యూటీ పై లిక్కర్ ను తెప్పించి వాడుతారు. దీనికి తోడు ఫంక్షన్లల్లో  మద్యం వినియోగించుకోవడానికి అవసరమైన అనుమతి ఎక్సైజ్ శాఖ నుండి పర్మిషన్ తీసుకోకుండా,  విదేశీ మద్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి బంధువులకు పెట్టి గొప్పలు చాటుకోవడానికి తంటాలు పడుతూ ఉంటారు. అచ్చం ఇలాగే జరిగింది. 
అనుమతి లేకుండా నాన్ పెయిడ్ లిక్కర్ వినియోగిస్తున్నారనే సమాచారం మేరకు శంషాబాద్ డిటిఎఫ్ ఎక్సైజ్ పోలీసులు మోయినాబాద్ లోని ఒక ఫామ్ హౌస్ లో దాడి చేసి ఫంక్షన్ లో వినియోగిస్తున్న 52 మద్యం బాటిలను సీజ్ చేయడంతో పాటు ఫంక్షన్ హాల్ పై కేసు నమోదు చేశారు.  మొయినాబాద్ పరిధిలో గోల మారి అనే ఫంక్షన్ హాల్ లో ఒక కుటుంబం తమ పిల్లలు, బంధువులతో కలిసి ఫంక్షన్ నిర్వహిస్తున్నారు. ఈ ఫంక్షన్ లో వచ్చిన బంధువులకు అతిథులకు  మందు మటన్ ఏర్పాట్లు చేశారు. తెలంగాణ మద్యానికి బదులు ఢిల్లీ, డిఫెన్స్ మద్యం బాటిళ్లను నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ని వినియోగిస్తుండగా దాడి చేశారు.  52 మద్యం బాటిళ్లను సీజ్ చేశారు. మద్యం వినియోగించిన వ్యక్తిపై కేసు నమోదుతో పాటు మద్యం వినియోగానికి లైసెన్స్ తీసుకోకుండా ఫంక్షన్ నిర్వహణకు ఇచ్చిన ఫంక్షన్ హాల్ యజమానిపై కేసు నమోదు చేసినట్లు శంషాబాద్ ఎక్సైజ్ సూపరిండెంట్  కృష్ణప్రియ తెలిపారు.

Tags:

Advertisement

Latest News