పహల్గామ్ ఉగ్ర దాడిని ఖండించిన తెలంగాణ భజరంగ్ సేన..!
పహల్గామ్‌లో జరిగిన క్రూరమైన ఉగ్రవాద దాడిని తెలంగాణ భజరంగ్ సేన తీవ్రంగా ఖండించింది. మతం అడిగి నిర్దాక్షిణ్యంగా పర్యాటకులను లక్ష్యంగా చేసుకొని దాడి చేసిన ఈ అమానవీయ చర్యలు అత్యంత బాధాకరమని చెప్పారు. ఇలాంటి దాడులకు పాల్పడిన వారికి తీవ్ర శిక్షలు విధించాలని బజరంగ్ సేన డిమాండ్ చేసింది. భజరంగ్ సేన తెలంగాణ అధ్యక్షులు లక్ష్మణ్ రావు నాయకత్వంలో, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఠాకూర్ వికాసింగ్ ఆధ్వర్యంలో భజరంగ్ సేన బృందం, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఉద్దేశించిన ఖండన పత్రాన్ని హైదరాబాదు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టికి సమర్పించారు. అనంతరం కాచిగూడ ఎక్స్ రోడ్స్ దగ్గరున్న వీర సావర్కర్ విగ్రహం ఎదుట మౌన ప్రదర్శన నిర్వహించారు. ఉగ్రవాదుల ఫోటోలు తగలబెట్టి.. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా బలమైన సందేశాన్నిఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ గుప్తా, టీడీపీ సీనియర్ జైరాజ్ యాదవ్, గులాబ్ శ్రీను, ప్రవీణ్ యాదవ్, నరేశ్, సుజీత్ మరియు తదితరులు పాల్గొన్నారు.