కుత్బుల్లాపూర్ లో ఆపరేషన్ సింధూర్ వాక్

By Ravi
On
కుత్బుల్లాపూర్ లో ఆపరేషన్ సింధూర్ వాక్

భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కి సంఘీభావంగా సూరారంలోని మల్లారెడ్డి విశ్వ విద్యాపీఠ్ ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ వాక్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రులు, హరీష్ రావు, మల్లారెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద హాజరయ్యారు. సరిహద్దుల్లో దేశ క్షేమం కోసం పోరాడి ప్రాణాలు కోల్పోయిన మురళి నాయక్ కు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేరుగా సైనికులతో పోరాడే ధైర్యం లేక దొంగ చాటుగా సామాన్య ప్రజలపై దాడి చేస్తున్న పాకిస్తాన్ కు సరైన గుణపాఠం తప్పదన్నారు. భారత సైనికులకు అండగా మేమందరం ఉంటామని ప్రతిజ్ఞ చేశారు హరీశ్ రావు.140 కోట్ల భారత ప్రజలకు అండగా దేశ సైనికుల పోరాటం చిరస్మరణీయమన్నారు. దేశం నుండి పాకిస్తాన్ విడిపినప్పటీ నుండి దొంగ చాటుగా దెబ్బలు తీయడం తప్ప,నేరుగా పోరాడే దైర్ఘ్యం లేదన్నారు. భారత దేశ ప్రజల కోసం అన్ని దేశాల మద్దతు ను  కూడగట్టిన ప్రధానమంత్రి మోడీ కి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో మల్లారెడ్డి వైద్య ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు, మల్లారెడ్డి ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు

Tags:

Advertisement

Latest News

ఎక్స్ వేదికగా జర్నలిస్టులను అభినందించిన సజ్జనార్ ఎక్స్ వేదికగా జర్నలిస్టులను అభినందించిన సజ్జనార్
దేశ సరిహద్దుల్లో పరిస్థితులను సైతం లెక్క చేయకుండా తమ ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న మీడియా జర్నలిస్టులకు ఆర్టీసీ ఎండీ, సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనార్...
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద గంజాయి అమ్మకం.. నలుగురు అరెస్టు
అత్తాపూర్ లో ఓ ఇంటిపై దాడి.. అల్ఫాజోలం స్వాధీనం
కాంగ్రెస్ లీడర్లకే ఇందిరమ్మ ఇండ్ల.. నిలదీసిన మహిళలు
జూబ్లీహిల్స్ టర్కీ కాన్సులేట్ జనరల్ వద్ద భారీ భద్రత
గచ్చిబౌలి స్టేడియం వద్ద తీవ్ర ఉద్రిక్తత
మలక్ పేటలోని మామిడి పండ్ల గోదాములపై దాడి.. ఇద్దరి అరెస్ట్