తిరుమలలో రంగంలోకి దిగిన ఆక్టోపస్ బలగాలు
By Ravi
On
భారత్-పాక్ ఉద్రిక్తతల నడుమ తిరుమలలో టీటీడీ శుక్రవారం హై అలర్ట్ ప్రకటించింది. దీనితో స్థానిక పోలీసులతో పాటు ప్రత్యేక ఆక్టోపస్ బృందాలు రంగంలోకి దిగాయి. తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు వివిధ ప్రాంతాలు, వాహనాలు, భక్తులు తిరిగే ప్రాంతాల్లో ఆక్టోపస్ బలగాలు, టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ, పోలీసులు, డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు చేపట్టాయి. భక్తులు అప్రమత్తంగా ఉండాలని సిబ్బంది సూచించారు. నిత్యం స్వామి వారి దర్శనానికి లక్షల్లో భక్తుల రాకపోకలు సాగుతుంటాయి. ఇందులో భాగంగా రద్దీ ప్రాంతాలు, దేవాలయాలు, షాపింగ్ మాల్స్ వద్ద అప్రమత్తంగా ఉండాలని నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. ఈ మేరకు టిటిడి పలు ఆదేశాలు జారీ చేయడంతో భద్రత మరింత కట్టుదిట్టం చేశారు.
Tags:
Latest News
10 May 2025 10:31:45
సరిహద్దు రాష్ట్రాలలో ఉన్న తెలంగాణ పౌరుల కోసం, వారికి సహాయం అందించడం కోసం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్లో సరిహద్దు రాష్ట్రాలలోని...