లారీలో పట్టుబడిన 30కేజీల గంజాయి.. ముగ్గురు అరెస్ట్

By Ravi
On
లారీలో పట్టుబడిన 30కేజీల గంజాయి.. ముగ్గురు అరెస్ట్

 భద్రాచలం ఐటిసి కంపెనీ పార్కింగ్ యాడ్ లో లారీలోంచి 30 కేజీల గంజాయిని హైదరాబాద్ కు చెందిన ఎస్టి ఎఫ్ బి టీం ఎక్సైజ్ పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. ఐటిసి పేపర్ మిల్లు కోసం అవసరమైన మూడు సరుకు కర్రను తీసుకు వస్తున్న  లారీ డ్రైవర్ శివ ఒరిస్సా నుంచి గంజాయిని తీసుకొస్తున్న అర్జున్ ఎక్కించుకొని భద్రాచలం తీసుకువచ్చాడు. ఈ సమాచారం అందుకున్న  హైదరాబాద్ ఎస్టిఎఫ్ బి టీం ఎస్సై నాగరాజు మిగతా సభ్యులు కలిసి ఐ టి సి పార్కింగ్ యార్డులో నిలిచి ఉన్న లారీని తనిఖీలు చేయగా అందులో 30 కేజీల గంజాయి పట్టుబడినట్లు ఎస్సై బాలరాజు తెలిపారు. డ్రైవర్ శివ తో పాటు  ఒరిస్సాకు చెందినటువంటి అర్జున్ గంజాయి వ్యాపారిని కలిసి పలుమార్లు ఒరిస్సా నుంచి గంజాయిని తీసుకువచ్చి భద్రాచలంలో అమ్మకాలు చేపట్టినట్లు విచారణలో నిందితులు వెల్లడించారు. ఎప్పటి లాగానే ఈసారి కూడా తీసుకువచ్చినటువంటి గంజాయిని ఎస్టిఎఫ్ పోలీసులు పట్టుకోవడంతో గంజాయి అక్రమ రవాణాదారుల గుట్టురట్టు అయింది. పట్టుకున్న గంజాయి విలువ  రూ. 15 లక్షలు, సీజ్ చేసినటువంటి లారీ విలువ 20 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. డ్రైవర్ శివ గంజాయిని తీసుకొచ్చిన అర్జున్ మరో వ్యక్తి ప్రహ్లాదును గంజాయిని, లారీని భద్రాచలం ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించినట్లు ఎస్సై బాలరాజు తెలిపారు.
 గంజాయి పట్టుకున్నటువంటి ఎస్టిఎఫ్ బీ టీంను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వి.వి. కమలహాసన్ రెడ్డి, బీ టీం ఇంచార్జ్ ప్రదీప్ రావులు అభినందించారు.

Tags:

Advertisement

Latest News

రాసిపెట్టుకోండి వచ్చేది మనమే.. ఇచ్చేది మనమే.. కేసీఆర్ రాసిపెట్టుకోండి వచ్చేది మనమే.. ఇచ్చేది మనమే.. కేసీఆర్
రాసిపెట్టుకోండి ఇక వచ్చేది మనమే.. ప్రజలకు సంక్షేమం చేస్తుంది మనమే.. కల్లబొల్లి కబుర్లు చెప్పము.. చెప్పింది చేసి చూపిస్తాము.  ప్రత్యేక రాష్ట్రం కోసం పడ్డ కష్టం కాంగ్రెస్...
7నెలల బాలుడికి మెటబాలిక్ డిజార్డర్.. సాయం కోసం తల్లిదండ్రుల వినతి
సరూర్ నగర్ లో భారతీయ సైనికుల క్షేమం కోసం ప్రత్యేక పూజలు
తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు
క్షమించాలి రేపు విచారణకు రాలేను.. ఈడీకి లేఖ రాసిన హీరో మహేష్ బాబు
తెలంగాణ ప్రభుత్వ నూతన ప్రధానకార్యదర్శిగా రామకృష్ణారావు నియామకం
లారీలో పట్టుబడిన 30కేజీల గంజాయి.. ముగ్గురు అరెస్ట్